- తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు
- సిరిసిల్ల స్థితిగతిని మార్చిన నాయకుడు.
- అధికారం లేకున్నా ప్రజల వైపే నుంచే ప్రశ్నలు
- ఆ ఒక్క తప్పే ముంచేసిందా?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆజ్యం పోసిన నాయకుల్లో కేటీఆర్ కూడా ఒకరు.. తండ్రి నడిచిన బాటలో నడుస్తూ ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు..అధికార పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల వైపు నుంచి ప్రశ్నించడం కేటీఆర్ కున్న అలవాటు.. మాటతీరులో కానీ, పని విధానంలో కానీ తండ్రిని మించిన కొడుకుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి కేటీఆర్ గత రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పాలన అందించి మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం హైదరాబాదులో ఐటి డెవలప్ మెంట్ అయింది అంటే అది కేటీఆర్ చలవే అని చెప్పవచ్చు..అమెరికాలో ఐటీ జాబ్ చేసిన కేటీఆర్ అదే అనుభవంతో ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీలను హైదరాబాద్ తెప్పించి లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వచ్చేలా చేశారు.
ప్రస్తుతం ఆయన చేసిన అభివృద్ధి వల్లే ఎంతో మంది బీఆర్ఎస్ అధికారంలో లేకున్నా ఉద్యోగాలు మాత్రం చేస్తున్నారు..ఐటీ డెవలప్ మెంట్ అందవేసిన చెయ్యి కేటీఆర్ దే అని చెప్పక తప్పదు.. అలాంటి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించి అద్భుతమైన మెజారిటీతో గెలిచారు. ఒకప్పుడు సిరిసిల్ల అంటే ఉరిసిల్లగా పేరు ఉండేది. అలాంటి సిరిసిల్ల నియోజకవర్గాన్ని సిరిసంపదల నియోజకవర్గంగా మార్చిన గొప్ప నాయకుడు.. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాలకు సిరిసిల్ల నుంచే చాలావరకు చేనేత వస్త్రాలు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి.. ఆ విధంగా సిరిసిల్లలో పారిశ్రామిక రంగాన్ని ఎంతో డెవలప్ చేసి వేలాది మంది ప్రజలకు ఉపాధి చూపించారు..
అలాంటి కేటీఆర్ ఐటీ రంగంలో ఉన్నా, లేకున్నా ఇప్పటికీ ఎంతోమంది ఐటీ ఉద్యోగాలు చేసేవారు ఆయనను ప్రతిరోజు గుర్తు చేసుకుంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఐటీ అనేది చాలావరకు తగ్గిపోతుంది.. చాలామంది ఉద్యోగాలు కోల్పోతూ కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే తరుణంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు వచ్చాయి, కాంగ్రెస్ వచ్చింది ఉద్యోగాలు పోతున్నాయి అంటూ మాట్లాడుకుంటున్నారు.. ఏది ఏమైనా ఐటీ మంత్రిగా కేటీఆర్ వైదొలగి సంవత్సరకాలం గడిచిన ఆయనను మాత్రం మరవలేక పోతున్నారని చెప్పవచ్చు.