- ఉద్యమకారుడిగా ప్రజలకు దగ్గరై.?
- పదేళ్ల పాలనలో ఎన్నో సంచలనాలు
- పీఎం అవుతాను అన్న కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో ఉంచిన కాంగ్రెస్
- ఏడాది గడిచిన కేసీఆర్ పాలన మరవలేమంటున్నా ప్రజలు.!
కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఒక ఆరాధ్య దైవంగా చెప్పవచ్చు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీని స్థాపించి చివరికి రాష్ట్రాన్ని సిద్ధింప జేసేలా కృషి చేశాడని చెప్పవచ్చు.. అప్పుడు రాజా వంశీయుల పాలన ఏవిధంగా చరిత్రకి ఎక్కిందో, కేసీఆర్ పాలన కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర అని చెప్పవచ్చు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి అభివృద్ధి పనిలో కేసీఆర్ పేరే నిక్షిప్తమై ఉంటుంది.. ఇంకా వందేళ్లు గడిచిన ప్రత్యేక రాష్ట్రానికి ఆద్యం పోసిన వ్యక్తి ఎవరయ్యా అంటే కేసీఆర్ పేరు గుర్తు పెట్టుకుంటారు. అంతటి ఘనత సాధించిన కేసీఆర్ పార్టీని రెండు పర్యాయాలు గెలిపించిన ప్రజలు, మూడవసారి దారుణంగా ఓడించారు. దీనికి ప్రధాన కారణం ఆయనకు పెరిగిన అహంకార భావమే అని చెప్పవచ్చు.
నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా ప్రవర్తించి తన ఓటమికి తానే గొయ్యి తీసుకున్నారు.. ఈ వ్యతిరేకతను క్యాష్ చేసుకున్న కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి అద్భుతమైన ప్లానింగ్ తో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడిచినా సందర్భంగా రాష్ట్రమంతా సంబరాలు జరుపుకుంటున్న కానీ, ఇప్పటికి ఎంతో మంది ప్రజలు కేసీఆర్ ని గుర్తు చేసుకుంటున్నారు. మా సార్ ఉన్నప్పుడు బాగుండే, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమైన కానీ ఆయన పేరు మాత్రం మరవలేక పోతున్నారు. ఇప్పటికి రేవంత్ రెడ్డి ఎక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడిన అందులో పదిసార్లు కేసీఆర్ ను తలచుకుంటూ ఉపన్యసిస్తారు..
ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమై సంవత్సరం గడిచినా కానీ కేసీఆర్ పేరు మాత్రం ఇంకా నాయకులు, ప్రజల నోళ్ళలో మెదులుతూనే ఉంది.. కానీ ఆయన 9 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని విపరీతమైన అప్పుల పాలు చేసి భవిష్యత్తు తరాలకు ఏమి లేకుండా చేశారు.. దీంతో కాంగ్రెస్ ప్రజలు తరచూ ఏ మీటింగ్ పెట్టిన ఏం మాట్లాడినా కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ప్రతిసారి ప్రస్తావిస్తూ వస్తున్నారు.. ఏది ఏమైనా ప్రజలు మాత్రం రాష్ట్రం అప్పుల పాలైన పర్లేదు కానీ రాష్ట్రాన్ని ఎంతో కొంత డెవలప్ చేసిన వ్యక్తి మాత్రం కేసీఆరే అంటూ ఇంకా తలచుకోవడం కోసమెరుపు.