అల్లు అర్జున్ జాతకం చెప్పిన జ్యోతిష్యుడు.. మెగా ఫ్యామిలీకి చుక్కలే..?

Pandrala Sravanthi
చాలామంది కి జాతకాల పిచ్చి ఉంటుంది. అలా మామూలు జనాలతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ జాతకాల పిచ్చి లిస్టులో ఉంటారు.ఎంతోమంది రాజకీయ నాయకులు జాతకం చూయించి జాతకంలో దోషాలు ఏదైనా ఉంటే పరిహార పూజలు చేస్తారు.అలాగే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా జాతకాల ప్రకారమే సినిమా రిలీజ్ లు సినిమా పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. అయితే గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో వేణు స్వామి జాతకాలు మీడియా సంచలనం సృష్టిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మరో జ్యోతిష్యుడు అల్లు అర్జున్ జాతకం చెప్పి సంచలనం సృష్టించారు. మరి ఇంతకీ అల్లు అర్జున్ జాతకంలో ఏం చెప్పారంటే.. అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో చాలా వివాదాల్లో ఇరుక్కున్నారు.అరెస్ట్ కూడా అయ్యారు. అయితే గత కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ  మధ్య కోల్డ్ వారు నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. 

అయితే ఈ కోల్డ్ వారు రానున్న రోజుల్లో మరింత తీవ్ర స్థాయికి వెళుతుంది.మెగా కుటుంబం ఇండస్ట్రీలోని నిలదొక్కుకోవడానికి పరోక్షంగా అల్లు కుటుంబం కారణమైంది. ఇక మెగా ఫ్యామిలీ నుండి ఎంతోమంది స్టార్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా చిరంజీవి పేరును వాడుకున్నప్పటికీ ఆ తర్వాత సొంతంగా తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నాడు. బన్నీ రానున్న రోజుల్లో కూడా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ నే తెచ్చుకుంటాడు. దీంతో అల్లు మెగా ఫ్యామిలీ మధ్య దూరం మరింత పెరుగుతుంది. ఏదో ఒక కారణం వల్ల వీరి మధ్య అన్యోన్యత తగ్గిపోతుంది. తరచూ వీరి మధ్య గొడవలు తీవ్ర స్థాయికి వెళ్ళిపోతాయి. అల్లు అర్జున్ కొణిదెల ఫ్యామిలీకి పడక రెండు కుటుంబాలు దూరం అవుతాయి.

 ప్రత్యక్షంగా పరోక్షంగా వీరి మధ్య ఎన్నో గొడవలు వస్తాయి. భవిష్యత్తులో కూడా అల్లు అర్జున్ ప్రత్యేక పంతాలోనే సినిమాల్లో రాణిస్తారు. మెగా ఫ్యామిలీ పేరును వాడుకోరు. సినీ ఇండస్ట్రీలో పేరున్న బడా కుటుంబాలలో అల్లు మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. కానీ విధి వైపరీత్యాల కారణంగా అల్లు మెగా ఫ్యామిలీ మధ్య దూరం పెరుగుతుంది. గొడవలు వస్తాయి అంటూ ఆ జ్యోతిష్యుడు అల్లు అర్జున్ జాతకం ప్రకారం ఇలా ఉంది అంటూ సంచలన విషయాలను బయట పెట్టారు. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్స్ అల్లు అర్జున్ వల్ల మెగా అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు తారస్థాయికి వెళ్తాయి కావచ్చు మెగా ఫ్యామిలీకి చుక్కలే అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: