రేవంత్ : గ్రూప్ 2 పరీక్షల్లో చంద్రబాబును హీరో..కేసీఆర్‌ జీరో ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై... రోజురోజుకు విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక అంశంపై.. రేవంత్ రెడ్డి చుట్టే వివాదం తిరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ లోగోను మార్చేందుకు రంగం సిద్ధం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.  అటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చేసింది. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడంతో ఉద్యమకారులంతా మండిపడుతున్నారు. కాకతీయ అలాగే చార్మినార్ లోగోలను కూడా లేపేస్తున్నారు.
 

దీనిపై విమర్శలు రేవంత్ రెడ్డి... ఎదుర్కోవడం జరుగుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి పనిచేసిన నేపథ్యంలో... చంద్రబాబుకు నచ్చినట్లుగా  రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని గులాబీ పార్టీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సర్కార్... తాజాగా గ్రూప్-2 పరీక్షల్లో... మరో వివాదంలో చిక్కుకుంది.
 

తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 2 పరీక్షల్లో... తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ గురించి పెద్దగా ప్రస్తావించని... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. టిడిపిని లేపే ప్రయత్నం చేసింది.  అటు సీనియర్ ఎన్టీఆర్ 1983 ఎన్నికల సమయం గురించి కూడా... ఇందులో పేర్కొంది. అంతేకాదు తెలంగాణ ఉద్యమానికి... తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసినట్లుగా..  ప్రశ్నలు ఉన్నాయి.

కల్వకుంట్ల చంద్రశేఖర రావు కంటే... తెలంగాణను తీసుకువచ్చేందుకు చంద్రబాబు నాయుడు పోరాటం చేసినట్లుగా... ప్రశ్నలు ఉండడమే ఇప్పుడు వివాదానికి దారి అయింది. అసలు కాంగ్రెస్ గురించి...  ఒక్క ప్రశ్న ప్రస్తావించని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్...తెలుగుదేశం పార్టీని మళ్లీ.  

అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు అయితే కనిపించాయి. ఈ విషయాలను... తెలంగాణ వాదులు అలాగే గులాబీ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. అసలు గ్రూప్ 2  పరీక్షల్లో...  చంద్రబాబు నాయుడు భజన ఎందుకు చేశారని ఆగ్రహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు.  వెంటనే దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించి.. క్షమాపణలు చెప్పాలని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: