తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభం నుండి మంచి విజయాలను అందుకుంటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. స్టార్ హీరో స్థాయికి ఎదిగిన తర్వాత కూడా మంచి విజయాలను అందుకుంటూ ఇప్పటికే కూడా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి క్రేజ్ ను కంటిన్యూ చేస్తున్నాడు.
ఇకపోతే నాగార్జున ఆఖరుగా నా సామి రంగ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయింది. ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్ లో అన్ని సినిమాల కంటే లేటుగా విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ లో నాగార్జున కు జోడిగా ఆశికా రంగనాథ్ హీరోయిన్గా నటించగా ... అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా ద్వారా నాగార్జునకు మంచి విజయం దక్కింది. ఈ సినిమా కంటే ముందు నాగార్జున నటించిన కొన్ని సినిమాలు అపజయాలను అందుకున్నాయి.
వరుస అపజయాల నుండి నాగార్జునను ఈ సినిమా బయట పడేసింది. ఇకపోతే నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా రూపొందుతున్న కుబేర అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ అనే మూవీ లో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక నాగార్జున ప్రస్తుతం సోలో హీరో గా చేయడానికి వరుస పెట్టి కథలను వింటున్నట్లు తెలుస్తోంది.