భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవి.. చూసేందుకు 'జూ'కి వెళ్లి అందరూ షాక్?
విషయం ఏమిటంటే... ఈ పార్కులో 1963లో ఓ గమ్మత్తైన సంఘటన చోటుచేసుకుంది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువుని అందులో ఉంచామని సదరు పార్క్ యాజమాన్యం ప్రకటన ఇవ్వగా స్థానికులు అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నారట. అయితే అక్కడి ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద అద్దాలలో తమ తమ ప్రతిబింబం చూసిన జనాలు అవాక్కవుతూ... ఏదండీ ఆ ప్రమాదకర జంతువు? అని సదరు యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. ఇంకెవరు? ఆ ప్రమాదకరమైన జంతువు మీరే.. అందుకే ఇక్కడ మిమ్మల్ని మీరు చేసుకొనేందుకు అద్దాలను ఏర్పాటు చేసాం అని సమాధానం ఇచ్చారట. దాంతో అక్కడికి చేరుకున్న ఔత్సాహికులు అవాక్కయ్యారట. అంతేకాదండోయ్... వారు చెప్పిన సమాధానం విని, అందులో నిజం లేకపోలేదు.. అంటూ అక్కడినుండి వెనుదిరిగారట!
ఇక ఇలాంటి గమ్మత్తైన విషయాలు అక్కడ అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. కాగా ఈ జూ చాలా విశేషాలను కలిగి ఉంది. ఇది 1972లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ హిస్టారిక్ ప్లేసెస్‌లో స్థానం దక్కించుకుంది. ఈ జూ నవంబర్ 8, 1899న ప్రారంభించబడింది. ఇందులో 22 ప్రదర్శనలలో 843 జంతువులు దాకా ఉన్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. దీని మొదటి డైరెక్టర్ విలియం టెంపుల్ హోర్నాడే కాగా అతను 30 సంవత్సరాలు డైరెక్టర్‌గా పనిచేశాడు. జూ ప్రారంభం నుండి జంతు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది.