ఏపీ: మారిపోయిన లోకేష్.. ఒక్క ట్విట్ తో శభాష్..!

Divya
చంద్రబాబు తర్వాత టిడిపిని నడిపించే నాయకుడుగా నారా లోకేష్ ఉన్నాడనే విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది నేతలు కూడా తెలియజేశారు... అయితే గతంలో ఎన్నో రకాలుగా ట్రోల్స్ గురైన కూడా తను అనుకున్న విజయాన్ని 2024లో సాధించారు నారా లోకేష్. అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిలో ఉన్నప్పటికీ కూడా తన కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా సరే సహాయం చేస్తూ ఉన్నారు నారా లోకేష్. ముఖ్యంగా ఇతర ప్రాంతాలలో ఇబ్బందులకు గురవుతున్న కూడా వారిని కూడా ఇండియాకి తీసుకువస్తూ ఉన్నారు.

అయితే ఇప్పుడు తాజాగా టిడిపి కార్యకర్త గుంటూరు శ్రీను నిన్నటి రోజున ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని తెలియడంతో తీవ్ర బాగోద్వేగానికి గురయ్యారు నారా లోకేష్. ఈ విషయం పైన నారా లోకేష్ వారి కుటుంబానికి అండగా ఉంటానంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు.. దిద్దుకోలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు ఐ మిస్ యు .. ఆత్మ అభిమానం ఎవరికైనా ఉండవచ్చు కానీ ఆత్మహత్య చేసుకునే అంతగా ఉండకూడదు నువ్వు బలస్మరణానికి పాల్పడిన వార్త నాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది అని నిన్ను బ్రతికించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసాము కానీ కుదరలేదు సారీ శ్రీను..

నీ కష్టం ఏంటో తనకు ఎప్పుడూ చెప్పలేదని కలిగిన నష్టాన్ని సైతం ఎప్పుడూ తెలియనివ్వలేదు.. నువ్వు లేని నీ కుటుంబానికి అండగా అన్నగా నేను ఉంటానని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.. ఈ అన్నకి ఒక్క మెసేజ్ కూడా చేయాలనిపించలేదా .. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసే వారిని నా పుట్టినరోజులు ఒక పండుగల చేసేవారివి నీకు ఆపద వస్తే.. మీ అన్నను అడగాలనిపించలేదా అంటూ నారా లోకేష్ టిడిపి కార్యకర్త శ్రీను ఆత్మహత్య పైన భాగద్వేగం పోస్టుని షేర్ చేశారు.. ముఖ్యంగా కార్యకర్తలను సైతం తమ కుటుంబంలో భావిస్తూ ఉన్నారు టిడిపి.. గతంలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్న నారా లోకేష్ ఇప్పుడు పూర్తిగా మారిపోయి మరి తన పందా చూపిస్తున్నారు.ఈ విషయాన్ని విన్న కార్యకర్తలు సైతం లోకేష్ కి ఒక విన్నపాన్ని తెలియజేస్తూ పార్టీ కోసం ఎంతోమంది ఎన్నోచోట్ల చాలా అప్పులు చేసి మరి కష్టాలు పడుతున్నారని .. అలాంటి వారిని గుర్తించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: