ఏపీ: నాగబాబు రాజ్యసభకు నో ఛాన్స్.. లెక్కలు మారాయిగా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఉప ఎన్నికల కోసం ఇటీవలే షెడ్యూలు కూడా విడుదలయ్యింది.సుమారుగా మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉన్నది. వీటి పైన ఏపీలో అధికారం ఉన్న టిడిపి కూటమి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.నిజానికి మూడు ఎంపీ సీట్లు అంటే అందులో కనీసం ఒకటన్న జనసేన పార్టీకి దక్కుతుందని అది కూడా మెగా బ్రదర్ నాగబాబుకు కచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే నిజానికి ఇది చాలావరకు కరెక్ట్ అయ్యేది కానీ లేటెస్ట్ గా వచ్చిన లెక్కలు ప్రకారం అంతా తారుమార అయిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

వైసీపీకి చెందిన ఆర్ కృష్ణయ్య తన ఎంపీ పదవికి సైతం రాజీనామా చేయడం వెనక ఒక లెక్క ఉందనే వార్తలు వినిపించాయి. ఈసారి బిజెపి కోటా నుంచి ఢిల్లీలో పార్లమెంటులోకి అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారట అందుకే ఆయన రాజీనామా కంటే ముందుగా బిజెపి నేతలతో అన్ని విధాల అంగీకారం పొందిన తర్వాతే అలా చేస్తున్నారని సమాచారం. అందుకే కృష్ణయ్య అనుహ్యంగా రేసులోకి వచ్చారని అలా బిజెపి ఏపీ కోటాలో తన సీటును సైతం దక్కించుకున్నట్లు సమాచారం.

ఇక మిగిలిన రెండు సీట్లలో బీద మస్తాన్ రావు టిడిపి పార్టీకి చెందిన వ్యక్తి మధ్యలో ఆయన వైసీపీకి వెళ్లి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.. ఒకవేళ ఆ పార్టీ నుంచి రాజీనామా చేస్తే టిడిపి నేతలు తిరిగి మళ్ళీ తనని ఎంపీ గాని పంపించారనే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారట. దీనిని ఇప్పుడు టిడిపి రెన్యువల్ చేయాల్సిన పరిస్థితి ఉన్నదట.. ఇక మూడవ సీటు అయితే మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన ఆయన ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం దీంతో ఇప్పుడు ఈ ఒక్క సీటు మాత్రమే కొత్తవారికి వెళ్లబోతోందట. పైగా ఈ మూడు సీట్లు కూడా బీసీలకు సంబంధించినవి కావడంతో వారి ప్లేస్ లో వేరే వారిని తీసుకుని అవకాశం ఉండదు. మరి కూటమి నుంచి అభ్యర్థిగా ఎవరిని పంపిస్తారని చర్చ ఇప్పుడు మొదలైంది. అందుకే ఈసారి మెగా బ్రదర్ నాగబాబుకి ఇచ్చే అవకాశం లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: