ఏపీ: పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టిన దివ్వెల మాధురి.. ఏం జరిగిందంటే..?
పవన్ కళ్యాణ్ పైన కేస్ పెట్టినట్లుగా ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ దువ్వాడ పైన పవన్ కళ్యాణ్ చాలా అసభ్యకరమైన కామెంట్స్ చేశారని ఈ విషయం పైన పోలీసులు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని మాధురి కోరినట్లుగా తెలియజేసింది.. అంతేకాకుండా తాము తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు తమని చాలా దారుణంగా అవమానించారు అంటు చాలామంది యూట్యూబ్లో వల్గర్ గా పోస్టులు చేయడమే కాకుండా కామెంట్స్ తో చాలా ఇబ్బందిగా గురి చేశారని తెలియజేసింది మాధురి.
అలాగే మరొకవైపు దువ్వాడ శ్రీనివాస్ ను కూడా ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ పైన రెండునరెల్ల క్రితం దువ్వాడ చేసినటువంటి కొన్ని అనుచిత వ్యాఖ్యల పైన గతంలో కేసు నమోదు అయింది. దీంతో ఏ క్షణమైనా సరే దువ్వాడను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ గత కొంతకాలంగా కనపడలేదని సమాచారం. ఈ వైసీపీ నేత ఆచూకీ కోసం ప్రస్తుతం పోలీసులైతే గాలిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అటు పవన్ కళ్యాణ్ పైన కూడా కేసు నమోదు అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ కేసుతో ఎవరికి ఇబ్బందులు తలెత్తుతాయో చూడాలి.