టాలీవుడ్ టాప్ కమెడియన్ ఆలీకి నోటీసులు.. కుట్ర అంటూ ఫైర్... !
- ( హైదరాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . .
టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీకి ఊహించని షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితం తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని .. ఇక రాజకీయాలకు తనకు సంబంధం లేని లేదని .. తాను ఏ పార్టీకి సపోర్ట్ గా ఉండను అని ఇకపై ఉండబోను అని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆలీ ఇలా ప్రకటన చేయడానికి ప్రధాన కారణం ? ఏంటంటే ఆలీ ఏపీలో గత ఐదేళ్లు గా వైసీపీ కి సపోర్ట్ చేశారు. వైసీపీ తరపున ప్రచారం కూడా చేశాడు. అయితే ఆలీ పార్టీ కోసం ఎంత కష్టపడినా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. దీనికి తోడు ఆలీ ఆశించిన పదవులు రాలేదు. చివరకు రాజ్యసభ వస్తుందని వైసీపీ వాళ్లు ఊరించి ఊరించి ఊసురు మనిపించారు. దీంతో ఆలీ రాజకీయంగా విసిగి పోయాడు. పార్టీ లో ఉన్నా ఇటు ఇండస్ట్రీలో జనసేన తో పాటు తెలుగుదేశం వాళ్లతో మనోడికి యాంటీ అయిపోయాడు. కొన్ని అవకాశాలు సైతం కోల్పోయాడు.
అందుకే విసిగిపోయిన ఆలీ ఇక పై తాను రాజకీయాల్లో ఇకపై ఆక్టివ్ గా ఉండను అని అలా ప్రకటన చేశారో లేదో తాజాగా ఆలీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆలీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పంచాయతీ పరిధిలో సినీనటుడు ఆలీ ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ సెక్రటరీ శోభారాణి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు తాజాగా సినీ నటుడు ఆలీకి నోటీసులు అందాయి.
వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మామిడి పంచాయతీ గ్రామ సెక్రటరీ శోభారాణి ఇచ్చిన నోటీసులు ఆలీకి అందజేశారట. దీనిపై తన తరపు లాయర్ ద్వారా సమాధానం చెప్పేందుకు ఆలీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే తనకు నోటీసులు అందడంపై ఆలీ అంతర్గతంగా తన సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. తనపై కొందరు కావాలని కుట్రలు చేస్తున్నారని ... అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని కూడా ఆలీ అన్నట్టు టాకు బయటకు వస్తోంది. దీనిపై పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.