మహారాష్ట్ర రిజల్ట్... కేసీఆర్ ఖుషి..డీలా పడ్డ జగనన్న ?

Veldandi Saikiran
దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూసిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. అందరూ ఊహించినట్లుగానే... బిజెపి కూటమి మహారాష్ట్రలో మరోసారి అఖండ విజయాన్ని నమోదు చేయడం జరిగింది. మహారాష్ట్రలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు... ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు.

ఇక ఈ విజయంలో బీజేపీ... కీలక పాత్ర పోషించింది. దానికి తగ్గట్టుగానే లార్జెస్ట్... పార్టీగా భారతీయ జనతా పార్టీ అక్కడ అవతరించింది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కారణంగా... వైయస్ జగన్మోహన్ రెడ్డి డీలపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలవడమే. ప్రస్తుతం nda కూటమిలో... జగన్మోహన్ రెడ్డి భద్రశత్రువులైన పవన్ అలాగే చంద్రబాబు.. ఉన్న సంగతి తెలిసిందే.
 

దానికి తోడు బిజెపి విజయం కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతిచోట బిజెపి మెజారిటీతో పాటు సీట్లను కూడా గెలుచుకుంది. దీంతో ఏపీలో కూడా కూటమి  నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి షాక్ తగిలినట్లు కొంతమంది చర్చిస్తున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలిస్తే... జగన్ హ్యాపీగా ఉండేవారని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన.. ఆనందంగా ఉన్నారని సెటైర్లు పేల్చుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
 

ఇక తెలంగాణలో... కెసిఆర్ ప్రస్తుతం హ్యాపీగా ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఓడిపోవడం. తెలంగాణలో 6  గ్యారంటీలు అమలు చేస్తామని.. మోసం చేసిన కాంగ్రెస్ను మహారాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో రేవంత్ రెడ్డిని గులాబీ సోషల్ మీడియా తెగ ట్రోలింగ్ చేస్తోంది. అయితే ఈ ఫలితాల నేపథ్యంలో ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కూడా...కాస్త రిలాక్స్ అవుతున్నారట. కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పారని మహారాష్ట్ర ప్రజలను మెచ్చుకుంటున్నారట కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: