ఏపీ: వైసిపి పార్టీకి పూర్తిగా సినీ గ్లామర్ దూరమైనట్టేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో వైసిపి పార్టీకి గతంలో చాలామంది సిని సెలబ్రిటీలు అండగా నిలిచేవారు. ముఖ్యంగా కమెడియన్ ఆలీ, పోసాని కృష్ణ మురళి, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, శ్రీ రెడ్డి, యాంకర్ శ్యామల, మోహన్ బాబు, పృద్వి, జయసుధ, వీరే కాకుండా చాలామంది సెలబ్రిటీలకు కూడా అండగా నిలిచేవారు. అయితే కొంతమంది ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఒక్కొక్కరుగా అందరూ జారిపోయారు. వైసిపి పార్టీ స్థాపించినప్పుడు రాజశేఖర్ దంపతులు కూడా ఉన్నారు.. అలాగే ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి వంటి వారు కూడా మద్దతు తెలియపడం జరిగింది. వీరే కాదు సీనియర్ హీరోలు భానుచందర్, రాజా, కృష్ణుడు వంటి వారు కూడా వైసిపి పార్టీకి మద్దతుగా నిలవడం జరిగింది.

అయితే ఇందులో పదవులు అందుకున్న వారిలో కేవలం పృథ్వి ఉండగా కొన్ని కారణాల చేత గుడ్ బై చెప్పేశారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత పోసాని కృష్ణ మురళి కూడా రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ తెలిపారు. గతంలో పోసాని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా అందుకున్నారు. దీన్నిబట్టి చూస్తే రాబోయే రోజుల్లో టాలీవుడ్ నుంచి వైసీపీ పార్టీకి మాట్లాడేవారు ఎవరు ఉండరనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హీరోయిన్గా అప్పట్లో చలామణి అయిన రోజా వైసీపీ పార్టీలో మాజీ మంత్రిగా కూడా పనిచేసింది.

మరొకవైపు టిడిపి పార్టీకి సినీ గ్లామర్ మద్దతు పెరగడానికి ముఖ్య కారణం జనసేన పార్టీనే.. చాలామంది సినీ నటులు ఇతర టెక్నీషియన్స్ కూడా సపోర్టుగా ఉన్నారు. అదంతా కూడా మెగా కుటుంబం అండే అని ఇప్పుడు కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే వైసిపి పార్టీకి టాలీవుడ్ నుంచి పెద్దగా మద్దతు లేదని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పరిస్థితి ఇప్పుడు ఉన్నట్టుగా రేపు ఉండకపోవచ్చు.. వైసిపి పార్టీ మళ్లీ పుంజుకుంటే కచ్చితంగా మళ్లీ వైసీపీ వైపు అడుగులు వేసే అవకాశం చాలామంది సెలబ్రిటీలకు ఉన్నది. నిజానికి సినీ గ్లామర్ రాజకీయాలకు దూరంగా ఉంటేనే వారు కూడా ఇబ్బంది పడాల్సిన పని ఉండదని చాలామంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. రాజకీయాలను రాజకీయాలే చూడాలని సినిమా సెలబ్రెటీలు రాజకీయాలలోకి వచ్చి అవకాశాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారనీ తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: