టీవీ: పెళ్లికి సిద్ధమైన యాంకర్ రష్మీ.. ఫ్యాన్స్ బ్లాస్ట్ అయ్యే న్యూస్..!

Divya
ఈ మధ్యకాలంలో సిని సెలబ్రెటీలు సైలెంట్ గా బ్యాచిలర్ లైఫ్ ను వీడి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. కొంతమంది ప్రేమించి వివాహం చేసుకోగా మరి కొంతమంది కుటుంబ సభ్యులు చూసిన వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా త్వరలోనే యాంకర్ రష్మీ వివాహం చేసుకోబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకు కారణం రష్మి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు అందుకు కారణం అన్నట్లుగా తెలుస్తోంది. మరి రష్మి షేర్ చేసిన ఫోటోలను ఏముందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.
యాంకర్ గా బుల్లితెరపై తన హవా కొనసాగించిన రష్మి.. శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి షోలలో సందడి చేస్తూ ఉన్నది. గత కొంతకాలంగా బుల్లితెర నటుడు హీరో సుదీర్ని వివాహం చేసుకోబోతోందని వార్తలు వినిపించాయి.కానీ చివరికి వీరిద్దరూ స్నేహితులమనే విషయాన్ని బయటపెట్టారు. అంతేకాకుండా అప్పుడప్పుడు రష్మీ బుల్లితెర పైన కూడా పలు రకాల ఈవెంట్లలో తన పెళ్లికి సంబంధించిన విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నది ఇప్పుడు తాజాగా మెహంది పెట్టుకున్న ఫోటోలను సైతం షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది.

రష్మి చిరునవ్వులు చిందిస్తూ ఒక కన్నుకొడుతూ టైం టు ఫోటో బాంబ్ మై ఫీడ్ అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది రష్మీ. దీన్ని బట్టి చూస్తే రష్మీ వివాహానికి సిద్ధమయ్యిందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది మాత్రం సుధీర్ తో వివాహం ఎప్పుడు రష్మీ అంటూ ఆమెను ప్రశ్నలు సైతం కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దీనిపై మన రష్మీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.. మొదటిసారి రష్మీ హోలీ అనే చిత్రం ద్వారా తెలుగు తేరకు పరిచయమైనప్పటికీ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించింది కానీ ఈమెకు జబర్దస్త్ ద్వారానే భారీ పాపులారిటీ సంపాదించుకున్నది. ఈ మధ్యకాలంలో సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేసినట్లు తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: