పవన్ కళ్యాణ్ ను వణికిస్తున్న మజ్లిస్ పార్టీ... జనసేనపై బ్యాన్?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో కేసు నమోదు అయింది. వెంటనే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన చర్యలు తీసుకోవాలని... ఎంఐఎం పార్టీకి సంబంధించిన కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేయడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిసి మరి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశారు ఎంఐఎం కార్యకర్త.

ఇక మజిలీస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త కేసు పెట్టిన తరుణంలో... జనసేన పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అంతేకాదు జనసేన పార్టీపై నిషేధం విధించాలని కూడా... మజిలీస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.  ఇక ఎంఐఎం పార్టీ కార్యకర్త పెట్టిన కేసు పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా స్పందించడం జరిగింది. హైదరాబాదులోని ఓల్డ్ సిటీ వాసులు, ఎంఐఎం నేతలు... ఇండియా సంస్కృతిని విమర్శిస్తారు అంటూ పవన్ కళ్యాణ్  చేసిన వ్యాఖ్యలపై తమకు ఫిర్యాదు అందిందని ఆయన పేర్కొన్నారట.
దీనిపై mim కార్యకర్తలు.. ఫిర్యాదు చేసినట్లు.. ఆయన వివరించారు. అయితే ముస్లిం మైనారిటీలకు సంబంధించిన... కార్యకర్తలు ఫిర్యాదు చేయగానే వెంటనే కేసు నమోదు చేసినట్లు... హైదరాబాద్ సివి ఆనంద్ పేర్కొన్నారు.  ఈ కేసు పై ఎలా ముందుకు వెళ్లాలి అనే దాని పైన అన్వేషిస్తున్నట్లు తెలిపారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని మరి దీనిపై చర్యలు తీసుకుంటామని సివి ఆనంద్ పేర్కొనడం జరిగింది.

ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగానే హిందువులు, ముస్లింల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఆయనపై... కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అవసరం అనుకుంటే జనసేన పార్టీపై నిషేధం కూడా విధించేలా... ఎంఐఎం పార్టీ  పోరాటం చేసే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు... ఇప్పుడు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. బిజెపి నేతలకంటే చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా ఫైర్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: