మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు మద్దతు ?
బిజెపి అయితే పవన్ కళ్యాణ్ లాంటి సెలబ్రిటీని తీసుకువెళ్లి ప్రచారం చేయిస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి ఇలాంటి బలమైన లీడర్లను మహారాష్ట్రలో దింపుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికల్లో ఓ సంచలన అంశం తెరపైకి వచ్చింది. తాజాగా రాహుల్ గాంధీ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేశారు. దీంతో ఈ అంశం జాతీయ వ్యాప్తంగా వైరల్ గా మారింది. మహారాష్ట్ర ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు మద్దతు తెలుపుతున్నారని.. కొంతమంది కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.
వాస్తవంగా శనివారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించిన సంగతి తెలిసిందే. రామ్మూర్తి నాయుడు మరణించడంతో... మహారాష్ట్ర ప్రచారానికి వెళ్లకుండా ఏపీకి వెళ్లిపోయారు చంద్రబాబు నాయుడు. ఈ తరుణంలోనే బిజెపి నేతలు ఎవరు కూడా చంద్రబాబు కాంటాక్ట్ కాలేదు. చంద్రబాబు తమ్ముడికి నివాళులు కూడా అర్పించలేదు. అయితే దీన్ని క్యాష్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ... వెంటనే చంద్రబాబు నాయుడు కు ఫోన్ చేశారట.
చంద్రబాబు నాయుడు సోదరుడు మరణించడం పై వివరాలు సేకరించారట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారట. అయితే చంద్రబాబు నాయుడుకు రాహుల్ గాంధీ ఫోన్ చేయడంతో... మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్కు టిడిపి మద్దతుగా నిలిచిందని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీన్ని బిజెపి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. సంతాపం కోసం ఫోన్ చేస్తే ఇలా తప్పుడు ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయిందని మండిపడుతున్నారు.