సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారి పై పోలీసులు కేసులు పెడుతున్నా సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు అందించారు. ఎక్స్‌లో వ్యూహం సినిమా పోస్టర్లు పోస్ట్ చేసి.. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రమోషన్ లో టైమ్ లో ఆనాటిప్రతిపక్ష నేత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటోలను మార్ఫింగ్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. అయితే తాజాగా ఈ పోస్ట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదైంది. మద్దిపాడు మండల చెందిన తెదేపా కార్యదర్శి రామ్ గోపాల్ పై ఎం.రామలింగం అనే వ్యక్తి ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేసారు.ఈ నేపథ్యంలో సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. వ్యూహం ప్రి రిలీజ్ వేడుకలో దాసరి కిరణ్ తో కలిసి పాల్గొన్న ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. డిసెంబర్ లో తమ మూవీ వ్యూహం రిలీజ్ కావాల్సి ఉండేనని, అయితే లోకేశ్ తన తెలివినంతా ఉపయోగించి వ్యూహం మూవీని విడుదల కాకుండా ఆపారని అన్నారు. అందుకు లోకేశ్ కు తాను థ్యాంక్స్ చెబుతున్నట్లు సెటైర్లు వేశారు. డిసెంబర్ లో తమ మూవీ రిలీజ్ అయ్యుంటే ఈ పాటికి జనాలు మరిచిపోయి ఉండేవారని, కానీ ఇప్పుడు విడుదల కానుండటంతో తమ మూవీ బాగా పాపులర్ అవుతుందని అన్నారు. ఇదంతా లోకేశ్ వల్లేనని ఎద్దేవా చేశారు. గత డిసెంబర్ లో తమ మూవీని రిలీజ్ కాకుండా ఆపి తాను ఇంటెలిజెంట్ అని లోకేశ్ మరోసారి నిరూపించుకున్నాని ఎద్దేవా చేశారు. సరిగ్గా ఎన్నికల సమయంలో తమ మూవీ రిలీజ్ కానుండటం హ్యాపీగా ఉందని ఆర్జీవీ అన్నారు.