నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో వస్తున్న బిగ్గెస్ట్ మాస్ మూవీలో నటిస్తున్నాడు.. ‘NBK 109’అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేసారు.. ఈ సినిమా టైటిల్ ‘ డాకు మహారాజ్ ‘ గా మేకర్స్ ఫిక్స్ చేసారు..వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు..ఇప్పటికే మూడు వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య ఈ సినిమాపై కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు..ఇదిలా ఉంటే నేడు ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేసే క్రమంలో చిన్న ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు సంగీత దర్శకుడు థమన్‌తో పాటు దర్శకుడు కొల్లి బాబి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ హాజరయ్యారు.పలువురు మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు వారు జవాబు ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఓ విలేఖరి ఈ సినిమాకు దేవిశ్రీని కావాలనే వదులుకున్నారా..? అని దర్శకుడు బాబిని ప్రశ్నించారు.బాబి జవాబు చెప్పేందుకు సిద్ధమవుతుండగా..వెంటనే నిర్మాత సూర్యదేవర నాగవంశీ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. తమన్ మాత్రమే నా చాయిస్ అని చెప్పేసారు.. ఈ సినిమాకు దేవినా.. తమనా అన్న ప్రశ్న ఎప్పుడు వచ్చినా కూడా తమన్ నే నేను కోరుకుంటాననీ నాగవంశీ షాకింగ్ కామెంట్స్ చేసారు... ఆ తర్వాత బాబి కలుగజేసుకొని కాంట్రవర్సీ క్రియేట్ చేయవద్దు.. ఒక్కో సినిమాకు.. ఒక్కో కథకు ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ సెట్ అవుతారని చెప్పి కవర్ చేసారు..అయితే గత కొంతకాలంగా దేవిశ్రీనీ టాలీవుడ్ దర్శకులు దూరం పెడుతున్నారు.. తమన్ క్రేజ్ భారీగా పెరగడమే దీనికి కారణం.. దేవిశ్రీ నే రిపీట్ గా తీసుకునే దర్శకులు సైతం తమన్ నే కోరుకోవడంతో టాలీవుడ్ లో దేవిశ్రీ ప్రస్తుతం గడ్డు పరుస్థితులు ఎదుర్కుంటున్నాడు..