మహిళా మంత్రిని భయపెడుతున్న అరటిపండ్లు.. అసలేం జరిగిందంటే?
ఇలా ఒక్కొక్కరికి ఒక్కో ఫోబియా ఉంటుంది. అందుకే ఇక ఫోబియా ఉన్నప్పుడు వారికి భయం కలిగించే విషయాల దగ్గరికి వెళ్లడానికి అందరూ తెగ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక విచిత్రమైన ఫోబియా గురించే. ఆమె ఏకంగా ఒక దేశంలో మహిళ మంత్రిగా కొనసాగుతున్నారు. లింగ సమానత్వం శాఖకు సంబంధించి మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆమె చివరికి ఒక ఫోబియా తో బాధపడుతున్నారు. ఆమె అరటి పండ్లు చూసారు అంటే చాలు తెగ కంగారు పడిపోతున్నారు.
స్వీడన్ లో జెండర్ ఈక్వాలిటీ మినిస్టర్ గా కొనసాగుతున్న పాలినా బ్రాండ్ బర్గ్ అరటి పండ్లు చూస్తే చాలు ఆమడ దూరం పరిగెత్తుతున్నారు. ఆమెకు బనానా ఫోబియా ఉంది. అందుకే ఆమె ఎక్కడ పర్యటనకు వెళ్ళినా కూడా ముందే అక్కడి అధికారులతో అక్కడ ఎక్కడ దరిదాపుల్లో కూడా బనానా కనిపించకుండా ఉండేలా ఏర్పాట్లు చేయించుకుంటున్నారు. అయితే ఈ ఫోబియా నుంచి దూరం కావడానికి ఆమె ప్రత్యేకమైన చికిత్స కూడా చేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఈ ఫోబియా కారణంగా అరటి పండ్లు కనిపిస్తే చాలు వికారం కంగారు లాంటివి ఆమెలో కనిపిస్తూ ఉంటాయట.