1100 దోపిడీలు, 185 హత్యలు.. బాలయ్య 'డాకు మహారాజ్' స్టోరీ ఇదేనా?

praveen
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 60 ప్లస్ వయసులో కూడా ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. వరుసగా సూపర్ హిట్లు సాధిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లు కొట్టిన నందమూరి బాలకృష్ణ.. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తూ ఉండగా.. ఇంకోవైపు అఖండ 2 సినిమాతో కూడా బిజీగా ఉన్నాడు. ఇటీవలే బాబి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాకు సంబంధించి టీజర్ విడుదలైంది.

 బాకు మహారాజ్ అనే టైటిల్ను ఈ సినిమాకు పెట్టారు. దీంతో ఈ సినిమా టైటిల్ అర్థమేంటి అసలు ఎవరి గురించి చెప్పబోతున్నారు అనే విషయంపై చర్చ జరుగుతుంది. కాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో బాలయ్య గెటప్, టైటిల్ పేరు ఇలా అన్నీ కూడా వైరల్ గా మారిపోతుంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్న వార్తలను బట్టి ఇది మాన్సింగ్ అలియాస్ డాకు మాన్సింగ్ జీవిత కథ అని ప్రచారం జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో చంబల్, పంజాబ్ ప్రాంతాలను తన అడ్డాగా చేసుకుని ఆంగ్లేయులకు ముచ్చమటలు పట్టించాడట మాన్ సింగ్.

 1890లో మధ్యప్రదేశ్ లోని కేరా రాథోడ్ గ్రామంలో జన్మించిన మాన్సింగ్ రాజ్పుత్ తెగకు చెందినవారు. దట్టమైన అడవి లోయలు కొండలు గుట్టలతో ప్రపంచానికి దూరంగా ఉన్న చెంబల్ ప్రజలకు మాన్సింగ్ దైవమట. 1939 నుంచి 1955 మధ్య కాలంలో నాటి తన దోపిడీలు దాడులతో బ్రిటిష్, స్వతంత్ర భారత ప్రభుత్వాలను కూడా గడగడలారించారట. దాదాపు 1112 దోపిడీలు 185 హాత్యాలు చేశారట. ఇలా ఆయన హత్య చేసిన వారిలో పోలీసులు కూడా ఉన్నారట. కేవలం 17 మంది ముఠాతోనే మాన్ సింగ్ ఇంతటి దోపిడిలకు పాల్పడేవారట. అప్పట్లో మోస్ట్ వాంటెడ్ అయినా మాన్ సింగ్ తలపై ప్రభుత్వం భారీ రికార్డు కూడా ప్రకటించిందట. కాగా 1955లో మధ్యప్రదేశ్ లోని కాకీకపుర బింద్ లో మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్న సమయంలో మాన్ సింగును రెజిమెంట్ దళాలు కాల్చి చంపాయట. అయితే వాస్తవానికి ఆయన చెడ్డవాడు కాదని పరిస్థితులు ఆయనని అలా మార్చాయని.. చంబల్ ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఇక స్థానికులందరికీ ఎప్పుడు ఆపదలో ఆదుకోవడం ఆర్థిక సహాయం చేయడం చేస్తూ అందరికీ దేవుడిగా మారాడట.  ఇక చంబల్ ప్రాంతంలో ఆంగ్లేయులు, పోలీసులు  అప్పట్లో డాకు మాన్సింగ్ పేరు చెప్పగానే భయపడేవారట. ఇక ఇప్పుడు బాలయ్య హీరోగా తెరకేకుతున్న సినిమాను కూడా ఈయన జీవిత కథ ఆధారంగానే తెరకెక్కిస్తున్నారని అందుకే సినిమా టైటిల్ డాకు మహారాజ్ అనే పేరు పెట్టారు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: