ఏపీ బడ్జెట్ : కానరాని మహాశక్తి పథకం... షాక్ లో మహిళలు ?
ఈ పథకం కింద 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య మహిళలకు ఏకంగా నేలకు 1500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చింది. అలాగే... మహిళలకు ఏడాదికి 18 ఆర్థిక సహాయం... పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బడ్జెట్ లో ఎక్కడ ఊసు ఎత్తలేదు. దీంతో మహిళలకు అన్యాయం చేశారని చంద్రబాబు ప్రభుత్వం పైన... అగ్గి గుగ్గిలమైతోంది వైసిపి.
ఇటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు 3000 రూపాయలు చొప్పున ఇవ్వలేదని కూడా మండిపడుతోంది. నిరుద్యోగుల కు భరోసా కల్పించడంలో... బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని... కూటమి పెట్టిన బడ్జెట్ పై జగన్మోహన్ రెడ్డి టీం ఆగ్రహిస్తోంది. వచ్చిన మూడు.. మాసాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కూడా... ఆగ్రహిస్తోంది.
తల్లికి వందనం పథకానికి కేవలం 2400 కోట్లు మాత్రమే కేటాయించారని... అవి ఎక్కడ సరిపోతాయని నిలదీస్తోంది వైసిపి. బడికి వెళ్లే ప్రతి పిల్లాడికి 15,000 రూపాయలు ఇస్తానన్న చంద్రబాబు హామీ ఏమైందని నిలదీస్తోంది వైసీపీ పార్టీ. ఈ పథకం కింద పదివేల కోట్లకు పైగా అవసరం ఉంటే కేవలం 2400 కోట్లు మాత్రమే ఇవ్వడం చెబుతున్నారు. అమ్మ ఒడి కింద ప్రతి ఏటా... 6400 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో రిలీజ్ చేసేదని... ఇప్పుడు చంద్రబాబు సర్కార్ అందులో సగం కూడా బడ్జెట్ లో పెట్టడం లేదని మండిపడుతోంది వైసిపి.