ట్రంప్ అధ్యక్షుడు కావడంతో.. అమెరికా మహిళలు సంచలన నిర్ణయం..!

Divya
అమెరికా ఎన్నికలు కూడా చాలా ఉత్కంఠత నెలకొంది ఫలితాలలో డోనాల్డ్ ట్రంప్ గెలిచారు..47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టడంతో అక్కడి మహిళలు విభిన్నమైన రీతిలో నిరసనను తెలియజేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డెమొక్రటిక్ అభ్యర్థి కమలహారిష్ పైన డోనాల్డ్ ట్రంప్ భారీ విజయంతో గెలిచారు. అయితే ఈ విషయాన్ని అక్కడ మహిళలు సైతం జీర్ణించుకోలేక పలు రకాల నిరసనలు మహిళలు తెలియజేస్తున్నారట. ఆయన పదవిలోకి వస్తే మహిళలకు సంబంధించి అబార్షన్  చట్టాలను సైతం మారుస్తారనే భయం అక్కడ మహిళలలో నిరసనకు కారణమయ్యేలా చేస్తోందట.
అందుకే అమెరికా మహిళలు లైంగిక పోరాటం ప్రారంభించాలని టెలిగ్రాఫ్ తెలియజేసింది..4B ఉద్యమం 2019లో దక్షిణ కొరియాలో మొదలయ్యిందట.. దేశంలో పురుష దౌర్జన్యాన్ని సైతం అంతం చేయాలని లక్ష్యంతోనే మహిళలు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారట.. స్త్రీలు భిన్న లింగ సంబంధాలను సైతం పూర్తిగా విమర్శిస్తూ ఉద్యమాలు చేపడుతూ నాలుగు అంశాలను తెరమీదకి తీసుకోవచ్చారు.. ట్రంప్ గెలిస్తే శృంగారం చేయరు, పెళ్లికి అనుమతించారు.. డేటింగ్లకు వెళ్లారు..పిల్లలు పుట్టారనే ప్రధాన పోరాటాలను తెరమీదకి తీసుకోవచ్చారు.

ఈ ఉద్యమం వల్ల దక్షిణ కొరియాలో జనాభా చాలా తగ్గిపోయిందని ఇది సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చనీ అంశంకు దారితీసిందట. ఎన్నికలలో ట్రంప్ గెలిస్తే మహిళలపై చాలా చట్టాలను అమలు చేస్తారని కమలహరిస్ కూడా ప్రచారంలో భాగంగా తెలియజేసింది.. ట్రంప్ అధికారంలోకి వస్తే అబార్షన్లను పూర్తిగా నిలిపివేస్తారని కూడా వీటికి తోడు ట్రంప్ ఎక్కువగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, విమర్శలు చేస్తూ ఉండడానికి ఇది ముఖ్య కారణం అయ్యింది.. లింగ వివక్షత వల్లే కమలహరిస్ కూడా ఎన్నికలలో ఓడిపోయిందనే విధంగా అక్కడ మహిళలు తెలియజేస్తున్నారట. అమెరికా మహిళ అధ్యక్షురాలని అక్కడివారు అంగీకరించలేదని అందుకు తగ్గ నిరసనలు కూడా తెలియజేస్తున్నారు. మగవాళ్ళు ఎప్పుడూ కూడా ఆడవాళ్లను వ్యతిరేకిస్తూ ఉంటారని అక్కడి మహిళలు తెలుపుతున్నారు. అది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: