ఏపీ: సీఎం చంద్రబాబు పై హైకోర్టు ఆగ్రహం.. ఇబ్బందిలోకి నెట్టేసిందా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పై మొదటిసారి రాష్ట్ర హైకోర్టు సైతం ఆగ్రహాన్ని తెలియజేస్తోంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి కేవలం ఐదు నెలలు కూడా కాలేదు కానీ అంతలోనే హైకోర్టు సైతం ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఇలాంటి నిర్బంధనలు ఏంటి? అంటూ గట్టిగానే ప్రశ్నించిందట. ఇందుకోసం వివరణ ఇవ్వాలి అంటూ కోర్టు కూడా ఆగ్రహాన్ని తెలియజేసిందట. గతంలో వైసీపీ హయాంలో రెండేళ్ల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు ఏకంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలలోనే ఇలాంటి వ్యాఖ్యలను ప్రశ్నించడం జరిగింది.

ఇది ప్రభుత్వ పనితీరును సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును సైతం ఇబ్బంది పెట్టే పరిణామాలు కనిపించేలా చేస్తున్నాయి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు కామెంట్లు చేస్తున్న వారందరి పైన కూడా సర్కారు ఇలాంటి చర్యలు తీసుకుంటోందని నిందితులుగా భావిస్తున్న వారందరిని అర్ధరాత్రి సమయాలలో అదుపులోకి తీసుకోవడం అది కూడా ఏలాంటి సమాచారం ఇవ్వకుండా వేరువేరు ప్రాంతాలకు తరలిస్తూ ఉండడంతో పాటుగా ఎక్కడ వారిని ఉంచుతున్నారు.. వారిని ఏం చేస్తున్నారని సమాచారం కూడా ఇవ్వలేదని దీనివల్ల హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయట.

సుమారుగా 40 వరకు పిటిషన్లు దాఖలు కావడంతో ఇదే మొదటిసారి చరిత్రలో ఇలాంటివి ఎదురుకావడంతో హైకోర్టు కూడా ఏపీ ప్రభుత్వం పైన ఆగ్రహాన్ని తెలియజేస్తుందట.. అక్రమ నిర్బంధనలు కూడా పెరిగిపోతున్నాయని పోలీసులకు చట్టాల గురించి చెప్పాల్సిన పని లేదు.. అవగాహన కల్పించాల్సిన అవసరం వచ్చింది అంటూ కోర్టు తెలియజేయడం జరిగింది. కానీ ఇది చంద్రబాబు వంటి సీనియర్ ముఖ్యమంత్రికి ఇలాంటి పనులు  అసలు తగదు అని కూడా పలువురు ప్రజలు తెలియజేస్తున్న మాట అన్నట్లుగా సమాచారం. గతంలో కూడా వైసిపి హయాంలో ఇలాంటివే జరిగితే ప్రశ్నించారని ఇప్పుడు ఈ నేపథ్యంలోనే సర్కారు కూడా తమ విధివిధానాలని సరిగ్గా పాటించలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: