పవన్ కళ్యాణ్ కు అమిత్ షా వార్నింగ్ ?

Veldandi Saikiran
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజగా ఢిల్లీకి వెళ్ళ్లారు. నిన్నటి రోజున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత వెలగపూడి సచివాలయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి పయనం అయ్యారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి నిన్న 3:30 గంటలకు విమానంలో వెళ్లి 5:45 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

విమానాశ్రయం నుంచి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లి నిన్న సాయంత్ర 6:30 నుంచి 7:00 వరకు ఆయనతో సమావేశం అయ్యారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అక్కడ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక విషయాలపై అమిత్ షా తో చర్చించారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, తదితర కీలక అంశాలపై చర్చింఛారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

ఇటీవల  ఆంధ్ర ప్రదేష్ రాష్ట్రంలో పోలీసు అధికారుల తీరుపై తీవ్ర ఆపేక్షణ వ్యక్తం చేస్తూ  ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.... చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేవలం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మాత్రమే కలిసేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.  అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఢిల్లీలో  అమిత్ షా వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు.

కాగా హోంమంత్రి అనితపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. వైసీపీకి ఓ అస్త్రం ఇచ్చినట్లు అయిందన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. అదే సమయంలో కూటమి మధ్య విభేదాలు వచ్చాయంటూ జాతీయ మీడియా విస్తృతంగా ప్రచారాలు చేసింది. ఓ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉంటూ పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ పార్టీల మధ్య దూరం లేదని అనుకోలేమని జాతీయ స్థాయిలో రాజకీయ చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: