అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్..భారతీయ సాఫ్ట్‌ వేర్లకు కష్టాలు తప్పవా ?

Veldandi Saikiran
అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అందరూ ఊహించిందే జరిగింది. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ విజ‌యం సాధించడం జరిగింది. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి మ్యాజిక్ ఫిగ‌ర్ 270 ఎల‌క్టోర‌ల్ ఓట్లు కావాల్సి ఉంది. అయితే.. దానికి తగ్గట్టుగానే... మ్యాజిక్ ఫిగ‌ర్ దాటేసి... అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ విజ‌యం సాధించడం జరిగింది. ఇప్ప‌టికే 277 ఎల‌క్టోర‌ల్ ఓట్లు గెలుచుకున్న రిప‌బ్లిక‌న్ పార్టీ.. అధికారం దక్కించుకుంది.

ఇక అటు 226 ఎల‌క్టోర‌ల్ ఓట్లు గెలుచుకుంది డెమోక్రాట్ పార్టీ.   అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించడంతో... మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని నిన‌దించారు  డొనాల్డ్ ట్రంప్. ఇక అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ విజ‌యం సాధించిన తర్వాత.. మీడియాతో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా సందేశాత్మకగా వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్.  ఇకపై అమెరికన్లకు స్వర్ణయుగమే అంటూ వెల్లడించారు  అమెరికా నూత‌న అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.  

ఇలాంటి విజ‌యాన్ని అమెరికా ఎప్పుడూ చూడ‌లేదని తెలిపారు  అమెరికా నూత‌న అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌. నా గెలుపు కోసం రిప‌బ్లిక‌న్లు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారని గుర్తు చేశారు. అమెరికాకు పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తానని ప్రకటించారు  అమెరికా నూత‌న అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.  ఇంత‌టి ఘ‌న విజ‌యం అందించిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు చెప్పారు.  అయితే...  అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో భారతీయుల్లో కొత్త ఆందోళన మొదలైంది.

హెచ్ వన్ బి వీసాల విషయంలో ...  గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిబంధనలు కఠిన తరం చేశాడు డొనాల్డ్  ట్రంప్. అలాగే మన ఇండియన్స్ ఎక్కువ శాతం అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వారి పట్ల... డొనాల్డ్ ట్రంప్‌ అప్పట్లో చాలా దారుణంగా వ్యవహరించాడు. అమెరికాలో వలసవాదులు ఎక్కువైపోతున్నారని మండిపడ్డాడు. ఇప్పుడు మళ్లీ గెలిచాడు కాబట్టి... సాఫ్ట్వేర్ ఉద్యోగులపై... ఆంక్షలు విధించే ప్రమాదం కూడా ఉంటుంది. ఇండియన్స్ కు తక్కువ ఉద్యోగాలు వచ్చేలా... సాఫ్ట్వేర్ రంగంలో మార్పులు చేసే అవకాశాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. అంటే అమెరికాలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తున్న భారతీయులకు కష్టాలు తప్పవన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: