కేటీఆర్ ని జైలుకి పంపేందుకు స్పాట్ ఫీక్స్ చేసిన రేవంత్? ఇక పార్టీ బాధ్యత హరీష్ రావు దేనా?
ఇంకోవైపు గొర్రెల పంపిణీ కుంభకోణం వెలుగు చూసింది. తర్వాత ఫార్ములా వన్ కోసం అనుమతి లేకుండా రూ.55 కోట్లు కేటాయించిన విషయమై విచారణ జరుగుతోంది. అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జీయోల్ వెళ్లిన మంత్రివర్గ బృందంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అక్కడే సంచలన ఆరోపణలు చేశారు. దీపావళికి ముందే అరెస్టులు ఉంటాయని తెలిపారు. దీపావళికి ముందు జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ అంటూ హడావుడి చేసినా.. ఆ బాంబు పెద్దగా పేలలేదు. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ అరెస్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో 144 సెక్షన్ విధించడం ఇందుకు సంకేతమని ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఒకటి రెండు రోజుల్లో బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి అరెస్ట్ అవుతారని అంచనా వేస్తున్నారు. చాలా మంది కేటీఆర్ అరెస్ట్ అవుతారని పేర్కొంటున్నారు. ఫార్ములా వన్ కోసం అప్పట్లో కేటీఆర్ ఓ విదేశీ సంస్థకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ.55 కోట్లు కేటాయించారు. ఈ విషయంలో ఆర్థిక కార్యదర్శిని విచారణ చేసిన ప్రభుత్వం ఇందుకు కేటీఆర్ బాధ్యుడని గుర్తించింది. అక్రమంగా నిధులు కేటాయించినట్లు నిర్ధారణ కావడంతో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
విదేశీ సంస్థకు రూ.55 కోట్లు కేటాయించిన విషయమై ఈడీ విచారణ జరిపింది. ఈడీ ఎదుట హాజరైన మాజీ కార్యదర్శి అరవింద్ కుమార్.. కేటీఆర్ ఆదేశం మేరకే రూ.55 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కేటీఆర్ అరెస్ట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి స్పాట్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈడీ అరెస్ట్ చేస్తుందా.. రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిన తర్వాత ఈడీ కస్టడీలోకి తీసుకుంటుందా అన్న చర్చ కూడా జరుగుతోంది.