నారా లోకేష్ ఏపీ భవిష్యత్ ముఖ్యమంత్రి... ఇంతకన్నా సాక్ష్యం కావాలా..?
ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడిల సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఐటి మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గత కొద్ది రోజులుగా అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు పారిశ్రామిక సంస్థలు సీఈవో లతో భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ అమెరికాలో లోకేష్ టూర్ కి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ అక్కడ ప్లెక్సీలు బుల్లి విమానానికి కట్టి తిప్పారు. అందులో పైన కనిపించే ఫోటో సహజంగా కొత్త సినిమాల ప్రమోషన్ల సమయంలో ఆయా హీరోల అభిమానులు ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు.. కానీ ఇప్పుడు నారా లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సీఎం అంటూ ఇలా ప్రచారం చేసింది. తెలుగుదేశం శ్రేణులా లేక లోకేష్ అభిమానుల అన్న సంగతి తేలాల్సి ఉంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాబినెట్ సమావేశాల దగ్గర్నుంచి ప్రతి మీటింగ్ లోను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమానంగా నారా లోకేష్ కు కూడా చోటు కల్పిస్తున్న విషయం తెలిసిందే. నారా లోకేష్ కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే విషయంలో చంద్రబాబుపై అటు కుటుంబ సభ్యుల నుంచి పార్టీలో కొంతమంది నాయకులు నుంచి ఒత్తిడి ఉన్నట్టు టిడిపి వర్గాలు ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో నారా లోకేష్ భవిష్యత్తు ముఖ్యమంత్రి అని ఇప్పుడే ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది ? అన్నదే రాజకీయ వర్గాలలో సహజంగా వినిపిస్తున్న ప్రశ్న. సహజంగా చంద్రబాబు తర్వాత టిడిపి సారధ్య బాధ్యతలు అయినా టిడిపిలో సీఎం పదవి అయినా లోకేష్ కే దక్కుతుంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టిడిపి - జనసేన - బిజెపి కలిసి కూటమి ప్రభుత్వ ఉన్నతరణంలో ఈ తరహా ప్రచారాలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది అన్న అభిప్రాయాన్ని కొంతమంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు.