ఏపీ: పెరిగిపోతున్న అత్యాచారాలు..మరో బాలికపై హాత్యాచారం.. ప్రభుత్వానికి పట్టదా..?
ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి ఆమె పైన అత్యాచారానికి పాల్పడిన సంఘటన అందరిని కలత చెందేలా చేస్తోంది. అలాగే ఈ చిన్నారిని హత్య చేసి అనంతరం మృతి దేహాన్ని సైలెంట్ గా పూడ్చిపెట్టడట ఆ దుర్మార్గుడు. ఈ సంఘటన తిరుపతి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నిన్నటి రోజున రాత్రి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. తిరుపతిలోనే సుశాంత్ అనే వ్యక్తి తమ సమీప బంధువులైన చిన్నారిని చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి తన వెంట తీసుకొని వెళ్లి మరి దుకాణంలో తినుబండారాలను కొనిచ్చి పొలంలోకి తీసుకువెళ్లి మరి అత్యాచారం చేసిన సంఘటన కుటుంబ సభ్యులను కలిచివేస్తోంది.
అయితే అనంతరం ఆ బాలికను చంపేసి మరి పూడ్చి పెట్టడం జరిగిందట.. అయితే ఎంతసేపైనా తన పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సైతం పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి ఫిర్యాదు చేశారట. ఈ సమయంలోనే అనుమానితుడైన సుశాంత్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని మరి విచారించగా అసలు నిజం బయట పడిందట.. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని వెలికి తీసి మరి పోస్టుమార్టం చేయగా ఈ విషయం బయటపడిందట. పోలీసులు కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల పైన చాలా అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి అనే విధంగా వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.. ఇలాంటి సంఘటనలకు ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అంటూ.. చిన్నారుల పైన అత్యాచారం ప్రభుత్వానికి పట్టదా అంటూ నిలదీస్తున్నారు. ప్రజలు కూడా మహిళలకు అవసరమైన రక్షణ కల్పించాలి అంటూ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.