వైయస్ షర్మిలకు బాడీగార్డ్ గా పవన్ కళ్యాణ్?

Veldandi Saikiran
వైయస్ షర్మిల కు...పటిష్టమైన భద్రత కల్పించేందుకు...ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన... ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఏలూరులో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...ఈ వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు ఎలాంటి భయం లేదని... కూటమి ప్రభుత్వం ఆమెకు అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వైయస్ షర్మిల మధ్య వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  తనకు ఆస్తి ఇవ్వకుండా... జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నారని..ప్రతిరోజు వైఎస్ షర్మిల రచ్చ రచ్చ చేస్తుం ది. జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేసి మరి.. ప్రెస్ మీట్ పెట్టి తిడుతోంది  వైయస్ షర్మిల. అంతే కాదు వైఎస్ విజయమ్మతో... కూడా ఆస్తుల పంపకం పైన ఓ స్టేట్మెంట్ ఇప్పించింది షర్మిల.

వైయస్ షర్మిలకు అనుకూలంగా వైయస్ విజయమ్మ కూడా మాట్లాడడం...ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే.. వరుస పరిణామాల నేపథ్యంలో తనకు ప్రాణభయం ఉందని... తనకు సెక్యూరిటీ పెంచాలని... తాజాగా ఏపీ ప్రభుత్వాన్ని కోరింది వైయస్ షర్మిల. అయితే వైయస్ షర్మిల... డిమాండ్ పైన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. కానీ తాజాగా.. కూటమి ప్రభుత్వం తరఫున డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు.

వైయస్ షర్మిల కు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఆమెకు ప్రత్యేక సెక్యూరిటీ ఇప్పించేందుకు కృషి చేస్తామని వివరించారు. ఆమెకు ప్రాణభయం ఉందని ఈమధ్య దరఖాస్తు పెట్టుకుందని... దానిపైన చంద్రబాబుతో చర్చిస్తానని కూడా ఆ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అదే సమయంలో తమ ప్రభుత్వంపై వైయస్ షర్మిల... విమర్శలు చేస్తే... కౌంటర్ కూడా ఇస్తామని... పవన్ కళ్యాణ్ నొప్పి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: