జగన్ ను షర్మిల అన్ని వేల కోట్లు డిమాండ్ చేసిందా.. వైరల్ వార్తల్లో నిజమెంత?
అయితే షర్మిల డిమాండ్ చేసిన మొత్తం ఇచ్చే పరిస్థితి లేదని జగన్ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఆస్తుల అటాచ్ మెంట్ వల్ల తాను ఏమైనా ఇవ్వాలనుకున్నా ఇవ్వలేనని జగన్ చెప్పడం షర్మిలకు కోపం తెప్పించిందని సమాచారం అందుతోంది. ఆస్తుల వివాదం అంతకంతకూ పెద్దది కావడంతో ప్రస్తుతం విజయమ్మ షర్మిల ఒకవైపు జగన్ మరోవైపు ఉన్నారని సమాచారం అందుతోంది.
షర్మిల పంతానికి పోయిన నేపథ్యంలో ఇకపై తాను షర్మిలకు డబ్బులు ఇవ్వకూడదని జగన్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. జగన్ కు షర్మిల అధికారాన్ని దూరం చేయాలని అనుకోవడం వెనుక కూడా ఆస్తుల వివాదమే కారణమని సమాచారం అందుతోంది. అన్నకు వ్యతిరేకంగా షర్మిల పోరాటం ఎంతకాలం పాటు కొనసాగుతుందో చూడాలి. అయితే షర్మిలకు అనుకూలంగా ఇకపై జగన్ నిర్ణయాలు మాత్రం ఉండబోవని భోగట్టా.
మరోవైపు షర్మిల తన ప్రవర్తనతో జగన్ మనస్సుకు గాయం చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది. జగన్ షర్మిల వేర్వేరు దారుల్లో పయనిస్తుండటం ఒకింత సంచలనం అవుతోంది. భవిష్యత్తులో వీళ్లిద్దరూ కలిసి పని చేసే ఛాన్స్ ఉంది. ఆస్తుల వివాదం జగన్, షర్మిల మధ్య పెట్టిన చిచ్చు పొలిటికల్ వర్గాల్లో సంచలనం అవుతోంది. షర్మిల విషయంలో జగన్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.