ఏపీ: మహిళలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా  మహిళలకు సైతం కూటమి ప్రభుత్వం మొదటి విడత కింద రూ.55 కోట్లను విడుదల చేసిందట ఇందులో ప్రతి ఒక్కరికి రూ .5లక్షల రూపాయల నుంచి 60 లక్షల మధ్య  MSE ప్రాజెక్టును సైతం ఏర్పాటు చేయబోతున్నారట. వచ్చేనెల రెండవ వారంలోనే వీటిని ప్రారంభించే విధంగా ప్లాన్ చేస్తోందట కూటమి ప్రభుత్వం.. మొత్తం వేయంలో 35% రాయితీ ఉండగా 10% లబ్ధిదారుని వాటాగా చెల్లించాలని తెలిపారు. అలాగే ఇతర బ్యాంకుల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వమే రుణాన్ని అందించేలా చేస్తుందట.

అయితే కేంద్ర పథకాలు అయితే PMFME అనే పథకానికి అనుసంధానం చేస్తారట. ఇవి చిన్న తరహా ప్రాజెక్టులకు కాకుండా వ్యక్తిగతంగా ఏర్పాటు చేసేలా చేస్తామని ముందుకు వచ్చిన వారికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తామన్నట్లుగా తెలియజేస్తున్నారు. 64 మంది మహిళలు కొత్తగా పరిశ్రమలు సైతం నెల కోల్పడానికి సిద్ధమయ్యారని మరో 65 మంది ఇప్పటికే వ్యాపారాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నారంటూ తెలుపుతోంది. అలా వీరి పనితీరును పరిశీలించిన తర్వాతే మరో రెండో విడతలు సుమారుగా 13000 మందికి లబ్ధి చేకూరేలా ప్లాన్ చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం పలు రకాల ప్రణాళికలను సిద్ధం చేస్తోందట.

త్వరలోనే ఈ ఏర్పాటు కాబోతున్న ప్రాజెక్టులు కూడా ఏపీలో చాలా చోట్ల ఉండబోతున్నాయట.. ముఖ్యంగా జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లను, బెల్లం ని తయారు చేసే పరికరాలను, మిల్లెట్ అండ్ హెల్పర్ యూనిట్, బేకరీ , డైరీ ఫార్మ్, పచ్చల తయారీ, సిమెంట్ బ్రిక్స్ యూనిట్ను తయారు చేసేవి, ఐస్ క్రీమ్ తయారీ, ఎంబ్రాయిడింగ్, కారంపొడి తయారీ తేనె తయారీ స్నాక్స్ కిరాణా దుకాణాలు ఇవే కాకుండా ఇతరత్రా వాటిని కూడా తయారు చేసుకుని యూనిట్లకు కూడా మహిళా సంఘాలతో సైతం డ్వాక్రా సంఘాల ద్వారా అందించే విధంగా కూటమి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకోబోతుందట. మరి డ్వాక్రా మహిళలు ఈ విషయంలో ఆనందపడతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: