హైదరాబాద్‌ లో నెల రోజులు 144 సెక్షన్‌..బయట తిరిగే లాఠీ విరుగుద్ది ?

Veldandi Saikiran
హైదరాబాద్‌ నగర వాసులకు బిగ్‌ అలర్ట్‌. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమలు చేసేందుకు తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో సోమవారం నుండి హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో కఠిన నిబంధనలు అమలులో ఉంటాయని నోటీసులు జారీ చేశారు తెలంగాణ పోలీస్ శాఖ.

హైదరాబాద్ లో పలు రకాల సభలు, సమావేశాలకు అనుమతులు లేవని, అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సిపి వెల్లడించారు. 28-10-2024 నుంచి 28-11-2024 వరకు అంటే సుమారు నెలరోజుల పాటు 144 సెక్షన్ నిబంధనలు అమలులో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలో ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది ప్రజలు ఒకే వద్ద గుమ్మికూడి ఉండొద్దంటూ, ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు చేయకూడదని పేర్కొన్నారు.

వీటన్నింటిపై నిషేధం విధిస్తున్నట్లు హైదరాబాద్ సిపి కార్యాలయం విడుదల చేసిన నోట్ లో భాగంగా పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.... నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సిపి నగర ప్రజలను కోరడం జరిగింది. కాగా, ఒకే రాష్ట్రం-ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి భార్యలు రోడ్డుపైకి ఎక్కి ధర్నాలు చేస్తుండడంపై పోలీసు శాఖ చర్యలు చేపట్టారు.

ఇప్పటికే 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ బెటాలియన్ కానిస్టేబుల్స్ రోడ్లపైకి నిరసనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. దీంతో తాజాగా మరో 10 మంది పోలీసులపై వేటు పడింది. దీనిపై కూడా బెటాలియన్ కానిస్టేబుల్స్ సీరియస్‌ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: