జగన్ చేసిన పనికి ' బొత్స ' కంప్లీట్ సైలెంట్...!
వైసిపి సీనియర్ నేత మాజీ మంత్రి ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న బొత్స సత్యనారాయణ కనిపించడం లేదు. తాజాగా జగన్ విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లారు బొత్స మాత్రం రాలేదు. ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను ) మొత్తం కార్యక్రమాలు దగ్గరుండి నడిపారు. ప్లెక్సీలు కూడా పెద్దగా కనిపించలేదు.. దీంతో బొత్స జగన్ పర్యటనకు ఎందుకు ? రాలేదు అన్న చర్చ ప్రారంభమైంది. బొత్స విదేశీ పర్యటనలలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ... కానీ ఆయన వీలైనంతగా జగన్కు దూరం పాటిస్తున్నారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ యేడాది జరిగిన సాధారణ ఎన్నికలలో ఓడిపోవడం బొత్స కు ఎంత మాత్రం రచించడం లేదు .. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా కనీసం తాను అయినా గెలవాల్సి ఉందన్నది ఆయన బాధ. కేవలం జగన్ చర్యలు ... అసలు తమలాంటి సీనియర్లు సలహాలు పట్టించుకోకపోవడం వల్లే వైసిపి చిత్తు గా ఓడిపోయిందన్న ఆవేదన ఆయనలో ఉంది.
ఆయన ఒక్కడు కాదు మొత్తం కుటుంబం అంతా చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఇక ఎమ్మెల్సీగా పోటీ చేయటం కూడా ఆయనకు ఇష్టం లేదు. టిడిపి పోటీ చేయకపోవడంతో బొత్స అనుహ్యంగా ఎమ్మెల్సీ అయ్యారు. ఉత్తరాంధ్ర పెద్దదిక్కుగా పార్టీ బాధ్యత అంతా తనకే ఉంటుందని చెప్పిన జగన్ బొత్స ను పక్కనపెట్టి మళ్ళీ విజయసాయిరెడ్డిని తెచ్చి విశాఖలో పెట్టారు .. ఆయన ఎంట్రీ ఇచ్చే మళ్ళి బొత్స కు పని లేకుండా చేశారు. ఈ అరాచకాలతో బొత్స విసిగిపోయారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక గుండెకు ఆపరేషన్ చేయించుకున్నాక ఆయన రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటున్నారు. ప్రెస్ మీట్ లు పెట్టడం తప్ప ఎక్కడ ఆవేశపడకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇటు తనను కాదని తన మేనల్లుడు మధ్య శ్రీనివాస్ కు పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే జగన్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇది కూడా బొత్స కు ఏ మాత్రం నచ్చలేదని అందుకే జగన్కు వీలైనంత దూరం పాటిస్తున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.