పిఠాపురం: వర్మ సైలెంట్.. సైకిల్ జోరు తగ్గిందా..?

Divya
ఏపీలో కూటమి ఎమ్మెల్సీలు  ఖరారు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులే పోటీ చేయబోతున్నారట. ఇక వారి పేర్లను కూడా పార్టీ ఇటీవలే ప్రకటించింది. 2024 ఎన్నికలలో చాలామంది నేతలకు సీటు దక్కన్లేదని నిరాశతో ఉన్నవారికి సీటు వదులుకున్న వారికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయోజనాలను కల్పిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలవడానికి సహాయపడిన వర్మకి మాత్రం ఈసారి నిరాశ తప్పడం లేదు.

తూర్పుగోదావరి నుంచి టిడిపి అభ్యర్థిగా ప్రకటించారు. ఆంధ్రాలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండు నియోజకవర్గాలలో తామే పోటీ చేయబోతున్నట్లు టిడిపి ప్రకటించింది. తమ అభ్యర్థుల ఎంపికను జనసేన, బిజెపి పార్టీలకు సమాచారం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరు, కృష్ణాలకు చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను ప్రకటించారు.. అలాగే తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి పేరాబత్తుల రాజశేఖర్ పేరుని తెలియజేశారు.

ఎన్నికలలో నాదెండ్ల మనోహర్ కోసం సీట్ త్యాగం చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించారు. గతంలో టికెట్టు ఆశించి నిరాశపడిన అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ కు ఇప్పుడు అవకాశాన్ని అందించింది కూటమి ప్రభుత్వం. కానీ పవన్ కోసం సీటు వదులుకున్న వర్మకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని గతంలో పవన్ కళ్యాణ్ కూడా వర్మ విషయంలో హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మను ఎవరు పట్టించుకోవడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలో మొదట నామినేట్ పదవులలో కూడా వర్మకి అవకాశం ఇస్తారనుకున్న ఇవ్వలేదు.. ఇప్పుడు ఇలాంటి పదవుల పైన కూడా వర్మకి ఏవి ఇవ్వకపోవడంతో పిఠాపురంలో సైకిల్ హవా తగ్గిందేమో అన్నట్లుగా పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. అలాగే వర్మ కి కూడా తన సొంత నియోజకవర్గంలో కూడా ప్రాధాన్యత తగ్గిపోతోందని పలువురు టిడిపి కార్యకర్తలు కూడా వాపోతున్నారు. మరి పిఠాపురంలో సైకిల్ జోరు తగ్గి గ్లాస్ హవా పెరిగిందా అనే విషయం తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: