బాల‌య్య‌తో పోటీ ప‌డుతోన్న ప‌వ‌న్‌... ఇది బిగ్ టాస్కే...!

RAMAKRISHNA S.S.
పవన్ కళ్యాణ్ ఏంటి..? బాలయ్యతో పోటీ పడటం ఏంటి..? అని అనుకుంటున్నారా. వీరిద్దరు సినీ రంగంలో హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీపడుతోంది బాలయ్యపై.. పై చేయి సాధించాలని చూస్తుంది.. సినీరంగంలో కాదు.. రాజకీయ రంగంలో కావటం విశేషం. బాలయ్య ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి హిందూపురంలో మూడు వరుస విజయాలు సాధించారు. పవన్ కళ్యాణ్ తొలిసారి పిఠాపురం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వీరిద్దరూ ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నారు. అయితే బాలయ్య తెలుగుదేశం తరఫున మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొనసాగుతుంటే.. పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యే అయిన కూటమి ప్రభుత్వంలో రెండు కీలక శాఖలో మంత్రిగా ఉండడంతో పాటు.. అటు ఉప ముఖ్యమంత్రిగాను కొనసాగుతున్నారు.

వాస్తవానికి బాలయ్య తొలిసారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు.. పార్టీ అధికారంలో ఉండడంతో హిందూపురం నియోజకవర్గాన్ని చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. కొన్ని కోట్లాది రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో ఆ పార్టీయే గెలుస్తూ వస్తోంది. అయితే గతంలో ఎన్టీఆర్, ఆ తర్వాత హరికృష్ణతో పాటు.. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎవరు గెలిచినా జరగనంత అభివృద్ధి 2014 - 2019 ఐదు సంవత్సరాల మధ్య బాలకృష్ణ చేసి చూపించారు. బాలయ్య రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో.. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి చేయలేదు.

ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో.. బాలయ్య మరోసారి హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని చూస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్యకు హిందూపురం కంచు కోట‌లా స్థిరపడినట్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని తన కంచు కోటగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఎలాగో ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోని నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసి భవిష్యత్తులో తనకు తిరుగులేని కంచు కోటగా మార్చుకునేందుకు చేప కింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఆయన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం 20 మంది జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి ప్రత్యేక ప్రణాళికలు కూడా రచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: