అమెరికాలో సైతం ఉచిత పథకాలు.. బీజేపీకి చిర్రెత్తుకొచ్చేలా కేజ్రీవాల్ పోస్ట్!

frame అమెరికాలో సైతం ఉచిత పథకాలు.. బీజేపీకి చిర్రెత్తుకొచ్చేలా కేజ్రీవాల్ పోస్ట్!

Reddy P Rajasekhar
ప్రస్తుతం మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉచిత పథకాలు అమలవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు పరిమితంగా ఈ స్కీమ్స్ ను అమలు చేస్తుండగా మరికొన్ని రాష్ట్రాలు లిమిట్ దాటి ఈ స్కీమ్స్ ను అమలు చేస్తున్నాయి. అడ్డూ అదుపు లేకుండా ఉచిత పథకాల అమలు వల్ల దేశానికి తీరని నష్టం కలుగుతుందని చాలామంది భావిస్తారు. అయితే అమెరికాలో సైతం ఉచిత పథకాల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి.
 
డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల హామీల్లో భాగంగా తాను అధికారంలోకి వస్తే కరెంట్ బిల్లులను సగానికి సగం తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అయితే ట్రంప్ పోస్ట్ ను కేజ్రీవాల్ రీపోస్ట్ చేయడంతో పాటు ఉచితాలు అమెరికా వరకు వెళ్లాయంటూ కామెంట్ చేశారు. ఉచిత పథకాలు ఓట్లపై ప్రభావం చూపుతాయని ట్రంప్ సైతం నమ్ముతున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
ఉచిత పథకాల హామీలు అమెరికాలో ట్రంప్ కు అధికారాన్ని తెచ్చిపెడతాయో లేదో చూడాల్సి ఉంది. కేజ్రీవాల్ బీజేపీకి చిర్రెత్తుకొచ్చేలా చేసిన పోస్ట్  ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం టార్గెట్ చేసే ఛాన్స్ వస్తే ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
ఉచిత పథకాలు దేశ ఆర్థిక పరిస్థితికే ప్రమాదం అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అర్హత లేకపోయినా కొంతమంది ఉచిత పథకాలు పొందుతుండటం గమనార్హం. ఉచిత పథకాల విషయంలో ప్రజల్లో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. కేజ్రీవాల్ ఈ కామెంట్లు చేయడం గురించి చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ ఢిల్లీలో మంచి పథకాలను అమలు చేయడం ద్వారా ప్రజల ప్రశంసలను అందుకుంటున్నారు. పాలిటిక్స్ లో కేజ్రీవాల్ సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: