ఏపీ మద్యం: కూటమి ఎమ్మెల్యేల దందా మొదలు పెట్టారా..?
అయితే ఇందులో చాలానే స్కాములు కూడా ఉన్నప్పటికీ వేలంపాటకు దరఖాస్తులకు దగ్గరే ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఏర్పడుతోంది. ఏ ఏరియాలో ఉండే ఎమ్మెల్యే అనుచరులు దందాలు చేస్తూ మద్యం దుకాణాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారని.. మరి కొంతమంది చేస్తున్న వ్యాపారస్తులను కూడా బెదిరిస్తున్నారని విధంగా వార్తలయితే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమ ఏరియాలో వచ్చే మద్యం షాపుకు సంబంధించి ముడుపులు ఇవ్వాలి అంటూ బెదిరిస్తున్నారట. లేకపోతే వ్యాపారంలో షేర్లు ఇవ్వాలి అనే కండిషన్ తో వ్యాపారస్తులను బెదిరించేలా చేస్తున్నారట. మరి కొంతమంది మాత్రం ఎవరు దరఖాస్తులు వేయకుండా చూసుకుంటూ ఉన్నారట.
ప్రస్తుతం వేలంపాట అనే రూపంలో సర్కారు కూడా పెద్ద ఎత్తున రేటు పెంచేసింది.. అంతేకాకుండా బిజినెస్ చేయాలి అంటే కచ్చితంగా లాభం ఉండాలి. అలాంటిది ఇప్పుడు మద్యం ముడుపులు కడుతూ పోతూ ఉంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక చాలామంది దరఖాస్తు చేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. మరి కొంతమంది మద్యం వ్యాపారాలలో మెలుకువ తెలిసినవాళ్లు దరఖాస్తు చేయాలనుకున్నప్పటికీ కూడా బెదిరింపులు చేస్తూ ఉండడంతో కాస్త మధనపడుతున్నారట. దీంతో కూటమి దందాతో ఇప్పుడు చాలా తలనొప్పి ఎదురవుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు మద్యం షాపు నుంచి తమకు 50 శాతం వాటా కావాలని అడుగుతున్నారట. దీంతో మాకొద్దీ మద్యం వ్యాపారం అంటూ చాలామంది చేతులెత్తేస్తున్నారట.అయితే మద్యం వ్యాపారులు కూటమి ప్రభుత్వం గెలవడంలో కూడా ఎంతో కొంత సహాయం చేసిన ఇప్పుడు ఎమ్మెల్యేల దందాల వల్ల చాలామంది వీరికి సపోర్ట్ చేసి తప్పు చేశామనే ఫీల్ అవుతున్నారట.