హైడ్రాకు తాత్కాలికంగా బ్రేక్ వేసిన తెలంగాణ సర్కార్.. అసలు ట్విస్ట్ ఇదే!
కొన్ని అంశాలకు పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ సర్కార్ హైడ్రాకు తాత్కాలికంగా బ్రేక్ వేయడం గమనార్హం. కనీసం 90 రోజుల పాటు కూల్చివేతల జోలికి వెళ్లవద్దని తెలంగాణ సర్కార్ హైడ్రాకు సూచనలు చేసింది. హైడ్రా ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో అంతర్గత నిర్మాణంపై ప్రధానంగా దృష్టి పెట్టడం గమనార్హం. జులై నెల 19వ తేదీన హైడ్రా ఏర్పాటు జరిగిన సంగతి తెలిసిందే.
హైడ్రా ఇప్పటివరకు 20 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించగా 50 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి, చెరువులను పరిరక్షించడం జరిగింది. హైడ్రా కూల్చివేతల వ్యవహారంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాబోయే మూడు నెలల్లో హైడ్రా చెరువుల సర్వే పూర్తి చేసి తుది నోటిఫికేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టనుందని సమాచారం అందుతుండటం గమనార్హం.
హైడ్రా విషయంలో ఎక్కువమంది పాజిటివ్ కామెంట్లు చేస్తుండగా కొంతమంది మాత్రం విమర్శలు చేస్తున్నారు. హైడ్రా వల్ల తమ జీవితం నాశనం అయిందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. హైడ్రా విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. హైడ్రా విషయంలో ప్రజల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని హైడ్రా ఇప్పటికే నిర్మించిన పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల విషయంలో కొంత సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.