ఏపీ: కూటమి కుంపట్లో.. సూపర్ సిక్స్ హామీలు.. సాధ్యమయ్యేవి అవేనా..?

Divya
కూటమి ప్రభుత్వానికి సూపర్ సిక్స్ హామీలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. గడచిన రెండు రోజుల క్రితం ఈ హామీలను అమలు చేస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చిన ఈ విషయం పైన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీలో భాగంగా పింఛన్ పెంపు వంటి మాత్రమే అమలు అయ్యాయి. ఇతర పథకాలను అమలు చేయాల్సిన వీటి కోసం ప్రజలు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఒక్కొక్క హామీని ఏపీ సీఎం చంద్రబాబు అమలు చేస్తారని ప్రజలు నమ్మిన.. ఇప్పుడు అమలు చేయకపోవడంతో ప్రజలు ఒక్కసారిగా నోరు విప్పుతున్నారు.

ముఖ్యంగా స్కూలు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి పిల్లలకు ఏర్పడడంతో పాటుగా నిత్యవసర ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. గతంలో ప్రభుత్వం నుంచి అందే పథకాల వల్ల చాలామంది వీటన్నిటిని అడ్జస్ట్ చేసుకునే వారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఇస్తామని ప్రకటించిన చేయలేకపోవడంతో కూటమి ప్రభుత్వానికి ఇవి కుంపటిలా మారుతున్నాయి. అయితే గత నెల నుంచి ఉచిత బస్సు ప్రయాణం, మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వాలని ప్రతిపాదించిన మెజార్టీ ప్రజలకు దీనివల్ల ఎలాంటి లాభం లేదట.

ఎక్కువ మెజారిటీ లబ్ధి పొందాలి అంటే తల్లికి వందనం (ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది), 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు 1500 రూపాయలు చొప్పున ప్రతినెల ఇస్తామని చెప్పడం జరిగింది. రైతు భరోసా 20వేల రూపాయలు ఇస్తే  చాలని విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారట. అయితే ఈ మూడు కూడా సాధ్యం కానీ హామీలనే విధంగా మరికొంతమంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. అలాగే 50 ఏళ్లకే పింఛన్ వ్యవహారం కూడా సాధ్యం కాదనే విధంగా చర్చించుకుంటున్నారు. ఒకవేళ సీఎం చంద్రబాబు చేయగలిగితే ఈ నాలుగు హామీలు చేస్తే తిరిగి మళ్ళీ అధికారం చేపట్టవచ్చు.. మరి రాబోయే రోజుల్లో ఈ వైఫ్ గా అడుగులు వేస్తారేమో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: