కేసీఆర్‌ ఏజ్‌ బార్‌...BRS లో కుమ్ములాటలేనా..అసలు వారుసుడు అతనే ?

Veldandi Saikiran
* 70 ఏళ్లు దాటిపోయిన కేసీఆర్ వయసు
* పదేళ్ల తర్వాత అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ
* కెసిఆర్ తర్వాత  కేటీఆర్,  హరీష్ మధ్య పోటీ
* రాజకీయాలకు దూరంగానే కల్వకుంట్ల కవిత
* హరీష్ రావుకే మంచి ఫాలోయింగ్

తెలంగాణ రాష్ట్ర సమితి.. పార్టీ గురించి ఎంత చెప్పినా తప్పు అవుతుంది. కేవలం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసమే ఈ పార్టీ పురుడు పోసుకుంది. అయితే అలాంటి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను సాధించుకొని అధికారంలోకి వచ్చింది. ఈ తరుణంలోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్... ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దాదాపు పది సంవత్సరాల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసిఆర్.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారు.  గుజరాత్ కూడా అందుకోలేని స్థాయికి ఎదిగింది తెలంగాణ రాష్ట్రం.
 దేశంలోని ఏ వ్యక్తి అయినా హైదరాబాదులో జీవించేలా... తయారు చేశారు. అయితే అలాంటి గులాబీ పార్టీకి ప్రస్తుతం కష్ట కాలం నడుస్తోంది.  సోషల్ మీడియా తప్పుడు ప్రచారం కారణంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అటు పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఎన్నడు లేని విధంగా జీరోకు పడిపోయింది టీఆర్ఎస్ పార్టీ. అయితే... ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని... ప్రతి విషయంలో ప్రశ్నించడంలో టిఆర్ఎస్ పార్టీ దూసుకు వెళ్తోంది.
 కానీ కెసిఆర్ ఆరోగ్యం.. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగా కనిపిస్తోంది. ఆయన వయసు 70 సంవత్సరాలు దాటిపోయింది. తరచు ఆయన ఆసుపత్రికి వెళ్తున్నారు. మహా అయితే మరొకసారి ముఖ్యమంత్రి అవుతారు కేసీఆర్. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీని నడిపే లీడర్ ఎవరు అనే దానిపైన ఆ చర్చ జరుగుతోంది. వాస్తవంగా కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. కానీ కేటీఆర్ కి ఇస్తే హరీష్ రావు వర్గం అసంతృప్తిగా ఉంటుంది.
 వాస్తవంగా కేటీఆర్ కంటే హరీష్ రావుకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. టిఆర్ఎస్ పార్టీలో కూడా హరీష్ రావు అనుచరులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి... కేటీఆర్ కు పదవి ఇచ్చే కంటే.. హరీష్ రావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని... కొంతమంది కోరుతున్నారు. అటు కేటీఆర్ కు పార్టీలో కీలక పదవి ఇచ్చి... ముందుకు వెళ్లాలి. కాదని కేటీఆర్ కు సీఎం పదవి ఇస్తే... పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి బావా బామ్మర్దులు ఇద్దరు... కూర్చొని ఈ పంచాయతీని తెలుపుకోవాలి. కెసిఆర్ వారసుడిగా హరీష్ రావు అయితేనే కరెక్ట్ అని.. తెలంగాణ ప్రజలు కూడా భావిస్తారు. కాబట్టి ఈ విషయంలో కేటీఆర్ కాస్త కామ్రమైజ్ అవ్వాలి. తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన టిఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: