పదేళ్లలో తెలంగాణని అలా మార్చేయనున్న రేవంత్ రెడ్డి..?

Suma Kallamadi
* తెలంగాణలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం రేవంత్  
* కొందరి నుంచే విమర్శలు వస్తున్న మెజారిటీ నుంచి ప్రశంసలే
* పదేళ్లు అధికారంలో ఉంటే తెలంగాణను పూర్తిగా మార్చే అవకాశం
(తెలంగాణ - ఇండియా హెరాల్డ్)
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన సమయం నుంచి చెబుతున్నారు ఆ విధంగానే ఆయన నడుచుకుంటున్నారు. యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీనవర్గాలతో సహా అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలన చూశాక చాలామందికి బీఆర్‌ఎస్‌ అంటేనే చిరాకు వచ్చేసింది. బీఆర్‌ఎస్‌ నేతలు పేదవారికి ఏమీ చేయడం లేదని నేను చాలామంది ఫైర్ అవుతున్నారు మళ్ళీ వాళ్లు అధికారంలోకి రాకూడదని ప్రతి ఎలక్షన్ లో కూడా కసిగా కాంగ్రెస్ కు ఓట్లు గుద్దేస్తున్నారు. రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో ఒక మంచి కార్యక్రమం చేపట్టి ప్రజలకు మంచి చేయడానికి సిద్ధమయ్యారు. అందువల్ల ఆయనకు మంచి పేరు వస్తుంది.
బీఆర్‌ఎస్‌ నేతలు అవే అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ నే మరోసారి గెలిపించేలాగా కనిపిస్తున్నారు. అదే జరిగితే రేవంత్ పదేళ్ల పాటు సీఎం సీట్ లో ఉంటారు. ఆయన ఇప్పటికే ఫ్రీ కరెంటు ఇస్తున్నారు. దీనివల్ల సంవత్సరం మీద నాలుగైదు వేల దాకా డబ్బులను ఆదా చేసుకోగలుగుతున్నారు ప్రజలు. ఇక మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఉండటం వల్ల వారికి కూడా డబ్బులు మిగులుతున్నాయి. గ్యాస్ సిలిండర్లపై కూడా తగ్గింపు లభిస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే కాంగ్రెస్‌కు ఇంకా మంచి పేరు వస్తుంది.
తెలంగాణను స్పోర్ట్స్ హబ్ గా కూడా తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి మంచి ప్రణాళిక వేశారు. రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి పెడుతున్న అందరి క్రీడాకారులను ఆయన కలిసి మంచిగా ప్రోత్సహిస్తున్నారు, ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. ఏఐ సిటీ, నెట్ జీరో సిటీ వంటి ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్టులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. వాటిని తన హయాంలోనే పూర్తిచేసే అవకాశం ఉంది. రాష్ట్రాలు విదేశాలు తిరుగుతూ భారీ పెట్టుబడులను కూడా తీసుకొస్తున్నారు. ఇలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో నెలకొల్పుతున్నారు.
బీఆర్‌ఎస్‌ రూ.7 లక్షల కోట్లు అప్పు చేస్తే, తమ ప్రభుత్వం పెద్దగా అప్పులు చేయనివ్వకుండా ఆయన చూస్తున్నారు. ఉన్న అప్పులకు వడ్డీ, అసలు ప్రతినెలా రూ.6,000 కోట్లు చెల్లిస్తూ తీర్చేస్తున్నారు. ఆర్థిక భారం ఉన్నా పథకాలు అమలు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలు రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని, వ్యక్తిగత కారణాల వల్ల కాదని చెబుతూ ప్రజలలో ఒక మంచి సీఎం గా కనిపిస్తున్నారు. ఢిల్లీ దేశ రాజధాని అని, నిధులు విడుదల చేయాలని తమ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందని ఆయన ఉద్ఘాటించారు.
హైదరాబాద్‌ ను కూడా చాలా చక్కగా మార్చేయడానికి సిద్ధమయ్యారు. గ్రౌండ్ వాటర్‌ పెంచడం, మూసీ నిర్వాసితులకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మూసీ ప్రక్షాళన ఆపనని స్పష్టం చేశారు. మూసీ మురికిని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ ప్రజలు మరోసారి ఛాన్స్ ఇస్తే మొత్తంగా  10 ఏళ్లలో ఆయన ఎన్నో సమస్యలను పరిష్కరించేలాగా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: