ఏపీ: అయ్యో..తీవ్ర అస్వస్థతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్..!

FARMANULLA SHAIK
ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తిరుమల బయలుదేరారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా నరసింహ స్వామి దేవాలయం వరకు చేరుకున్నారు.అయితే కాలు నొప్పి కారణంగా ఆయన మెట్లు ఎక్కేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన కొంత సేపు మెట్ల మీదే విశ్రాంతి తీసుకున్నారు.వేగంగా మెట్లు ఎక్కడం వల్ల పవన్‌ కు తీవ్ర మోకాళ్ల నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయం తెలుకున్న స్విమ్స్‌ కు చెందిన ఫిజియో థెరఫిస్ట్.. పవన్ కల్యాణ్ వద్దకు బయలుదేరారు. మరో గంట  లో పవన్ కల్యాణ్ తిరుమల చేరుకునే అవకాశముందని సమాచారం. ఈ రాత్రి పవన్ కల్యాణ్ తిరుమల లోనే బస చేయనున్నారు.బుధవారం ఉదయం తిరుమల వెంకన్నను ఆయన దర్శించుకోనున్నారు.
ఇదిలా వుండగా గత వైఎస్ జగన్ ప్రభుత్వ హాయం లో తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీ లో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యం లో ఈ వ్యవహారం పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఈ సిట్ శనివారం నుంచి తన దర్యాప్తును ప్రారంభించింది. అయితే కలియుగ దైవం శ్రీ వెంటేశ్వరని సన్నిధి లో తయారైన ప్రసాదం లో కల్తీ నెయ్యి వినియోగించడం పై పవన్ కల్యాణ్ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యం లో ఆయన ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు. అందులో భాగంగా విజయవాడ లో  కి ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం మెట్లను పవన్ కల్యాణ్ స్వయంగా శుభ్రం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకున్నాు. అక్కడి నుంచి అలిపిరి మెట్ల ద్వారా తిరుమల కు ఆయన పయన  మయ్యారు. రేపు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షను విరమించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: