ఏపీ:చంద్రబాబును ఏకిపారేస్తున్న వైసీపీ నేత.. చిక్కులు తప్పవా..?

Divya
గత ఐదు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో లడ్డు కల్తీ  వ్యవహారం అటు రాజకీయ నేతలను సినీ సెలబ్రిటీలను సైతం కుదిపేస్తోంది. ముఖ్యంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వైసిపి ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారో అప్పటినుంచి ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎంతోమంది వైసీపీ నేతలు ఈ విషయాలను ఖండించిన మరి కొంతమంది కూడా యూట్యూబ్లో ప్రభుత్వాన్ని సైతం పలు రకాల ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు తాజాగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా చంద్రబాబు లోకేష్ పైన ఫైర్ అయ్యారు.

కల్తీ లడ్డు వ్యవహారం పైన సీఎం చంద్రబాబుపై కొడాలి నాని ఇలా ఫైర్ అవుతూ.  నెయ్యి టెస్టింగ్ అయ్యాక తిరుమల కొండ పైన కూడా ఏ ట్యాంకర్ అయినా వెళ్తుంది అంటూ తెలిపారు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇందులో ఎక్కడ మార్పు ఉండదని నెయ్యి టెస్టింగ్ ఒకవేళ ఫెయిల్ అయితే కచ్చితంగా వెనక్కి పంపిస్తామని అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. వెంకటేశ్వర స్వామి విశిష్టతను కేవలం చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్  దెబ్బతీసేందుకే ఇలా కుట్ర పడుతున్నారని విధంగా మాట్లాడారు.

వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం దురుద్దేశంగా వాడకూడదని.. ఏ ల్యాబ్లో కూడా పశువుల కొవ్వు కలిసినట్లుగా రిపోర్టు ఇవ్వలేదని.. అన్నం తినేవాడు ఎవడు కూడా దేవుడు విశిష్టతను రాజకీయాలకు ఉపయోగించడు అంటూ ఫైరయ్యారు.. చంద్రబాబు వెంకటేశ్వర స్వామి భక్తుడు అయితే తన జీవితంలో ఒకసారైనా గుండు కొట్టించుకున్నారా.. లేకపోతే లోకేష్ కొట్టించుకున్నారా అంటూ ఫైర్ అయ్యారు. ఈ తిరుపతి లడ్డు వ్యవహారం పైన షిఫ్ట్ కాదు సిబిఐ విచారణ చేయాలి అంటూ లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణలు జరిపించాలి అంటూ తెలిపారు. చంద్రబాబు మా మక్కేలు విరగగొట్టడం కాదు.. దళితులపైన దాడి చేసిన రఘురామకృష్ణంరాజు ,పంతం నానాజీల వారి యొక్క మక్కలి విరగొట్టండి అంటూ తెలిపారు. చంద్రబాబు కుటుంబాన్ని అయినా, దేవుడు అయినా సరే రాజకీయం కోసమే వాడుకుంటారని హెచ్చరించారు. జగన్ను రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే డైరెక్ట్ గా రా వాటికి మేము సిద్ధంగానే ఉన్నాము కానీ ఇలా దేవుడి పేరుతో మతాల పేరుతో కూతమి ప్రభుతో పెద్ద కుట్ర చేస్తోంది అంటూ ఫైరయ్యారు.మరి కొడాలి నానినీ.. సీఎం చంద్రబాబు ఇబ్బందులు పెడతారా లేకపోతే.. ఇప్పటికే చాలామంది నేతలు యూట్యూబర్స్ అడిగిన ప్రశ్నలతో ఏపీ సీఎంకు చిక్కులు ఎదురవుతాయా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: