జమిలి ఎన్నికలతో ప్రజాస్వామ్యం ఏకస్వామ్యంలోకి.. జరిగేది ఇదేనా?
అయితే ఇలా చేయడం ద్వారా ఎన్నికల నిర్వహణ ఖర్చు తగ్గుతుందని.. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుందని.. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. పరిపాలనలో ఎలాంటి అడ్డంకులు ఉండవు అంటూ కేంద్రం చెబుతుంది. కానీ ఈ జెమిలి ఎన్నికల వల్ల జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ శాతం ఉంది అన్నది ప్రస్తుతం అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య బద్ధంగా నడుస్తున్న ఇండియా ఏకస్వామ్యం లోకి వెళ్ళిపోతుంది. ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి వస్తుంది.
కొన్ని కొన్ని సార్లు ఏకంగా రాష్ట్రపతి పాలన కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అయితే జమిలి ఎన్నికల ద్వారా ప్రజలకు సమయం ఆదావుతుందని మరో వాదన కూడా వినిపిస్తుంది. రెండుసార్లు ఓటు వేసే ప్రజలు ఒకేసారి ఓటు వేస్తారు. కానీ ప్రజలకు ఒక్క రోజు ఆదా చేసినంత మాత్రాన పెద్దగా ప్రయోజన ఏమి ఉండదు..
ఎందుకంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల దేశమంతటా జరిగి ఆ తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా మరల ఐదు సంవత్సరాలు వరకు ఎన్నికలు నిర్వహించని పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది అని రాజకీయ విశ్లేషకుల వాదన. ప్రజాస్వామ్య మెల్లమెల్లగా ఏకస్వామ్యంలోకి ప్రయాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏకంగా లోక్సభకు అనుగుణంగా రాష్ట్రాలలోని శాసనసభలు తమకు తాము సర్దుకుపోతాయని ఇలా సర్దుకుపోవడం ఒకరకంగా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే అవుతుంది.
ఇది కేంద్రానికి లాభం చేకూర్చిన.. ప్రజాస్వామ్యాన్ని మాత్రం బలహీనం చేస్తుంది అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే కాలంతో పాటుగానే ఎన్నికలను మరింత ఆధునికరణ పద్ధతులలో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేయడం మంచిదే. కానీ ఇలా ఎన్నికలు అన్నింటినీ కూడా ఒకే ప్యాకేజీ కింద చేసే విధంగా చేయడం వల్ల ప్రజలకు ప్రయోజనం కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు వాదన వినిపిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి.