జమిలి ఎన్నికలతో బీజేపీ నియంత పాలనకు ఛాన్స్.. ప్రాంతీయ పార్టీలకు గడ్డు కాలమేనా?

Reddy P Rajasekhar
కేంద్ర ప్రభుత్వం 2029లో దేశంలో జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. జమిలి ఎన్నికలతో బీజేపీ నియంత పాలనకు ఛాన్స్ ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించాలనేది బీజేపీ కుట్రలో భాగమేనని సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రముఖులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
 
జమిలి ఎన్నికలకు తమ పార్టీలు వ్యతిరేకమని ఇప్పటికే పలువురు కీలక నేతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోకుండా లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని చూడటం ప్రమాదకరమని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలతో బీజేపీ దేశాన్ని కబలించాలని చూస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
 
జమిలి ఎన్నికల వల్ల రాష్ట్రాల మధ్య ఐక్యత దెబ్బ తినే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో సీతారాం ఏచూరి లేకపోవడం మన దేశానికి తీరని లోటు అని ఆయన కామెంట్లు చేశారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ నిర్ణయం ప్రజాస్వామిక వ్యతిరేక నిర్ణయం అని ఆయన చెప్పుకొచ్చారు.
 
మరోవైపు జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు గడ్డు కాలమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జమిలి ఎన్నికల విషయంలో పిటిషన్లు దాఖలు అవుతాయేమో చూడాల్సి ఉందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జమిలి ఎన్నికల విషయంలో వస్తున్న విమర్శలపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. జమిలి ఎన్నికల వల్ల ఎన్నికల ఖర్చు తగ్గడం మినహా ఇతర ప్రయోజనాలు ఉండవని ప్రజల ఆలోచనా తీరుపై కూడా జమిలి ఎన్నికలు ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. ప్రాంతీయ పార్టీలు జమిలి ఎన్నికలను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: