కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే భారతీయులు చాలా తక్కువ శాతం మంది అమెరికాకు వెళ్లేవారు. అలా చాలా తక్కువ శాతం మంది భారతీయులు అమెరికాకు వెళ్లడం వల్ల వారికి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే దొరుకుతూ ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో ఇండియా నుండి అమెరికాకు వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువ అయింది. చాలా ఎక్కువ శాతం మంది ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళుతూ ఉంటే , కొంత మంది ఉద్యోగాల కోసం అమెరికాకు వెళుతున్నారు. అమెరికాకు వెళ్లిన వారిలో మునపటిలా ఇప్పటి వారికి ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదు. దానితో కాలం గడపడం కోసం ఏవో చిన్న చిన్న పనులను చేస్తూ వెళుతున్నారు.
ఉద్యోగం కోసం ప్రత్యేకించి అక్కడికి వెళ్లిన వారికి కూడా అంత గొప్ప ఉద్యోగాలు ఏమీ దొరకడం లేదు. వారు కూడా చిన్న చిన్న పనులను చేసుకుంటూ కాలాన్ని నెట్టుకుంటూ వస్తున్న వారు ఉన్నారు. చాలా కాలం క్రితం అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అయిన వారు చాలా మంది ఉన్నారు. ఇక అలాంటి వారు అమెరికాలోనే శాశ్వతంగా ఉండేందుకు గ్రీన్ కార్డు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్న మునపటిలా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్న వారికి గ్రీన్ కార్డు రావడం లేదు. గ్రీన్ కార్డు కోసం అమెరికా ప్రభుత్వం అనేక రకాలైన కొత్త కొత్త పద్ధతులను తీసుకురావడంతో గ్రీన్ కార్డును సంపాదించడం భారతీయులకు ఎంతో కష్టంగా మారింది. ఇక గ్రీన్ కార్డు ఎందుకు ఉపయోగిస్తారు అంటే ... ఆ దేశంలోనే శాశ్వతంగా బతకాలనుకుంటే గ్రీన్ కార్డు ను కచ్చితంగా పొందాల్సిందే.
ఒక వేళ గ్రీన్ కార్డ్ లేనట్లయితే హెచ్ 1-బీ వీసా రెన్యూవల్ చేసుకుంటూ పోవాలి. అది కుదరకపోతే స్వదేశానికి వెళ్లిపోవాలి. ఎన్ని గ్రీన్ కార్డులు మంజూరు చేయాలన్నది కూడా అమెరికా చట్టసభ నిర్ణయిస్తుంది. దానితో ప్రవాస భారతీయులు గ్రీన్ కార్డు కోసం ప్రస్తుతం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న అందులో చాలా తక్కువ శాతం మంది కి మాత్రమే గ్రీన్ కార్డులు అమెరికా ప్రభుత్వం జారీ చేస్తుంది. దానితో గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్నా వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది.