కేంద్రం కొత్త స్కీమ్ ఎన్పీఎస్ వాత్సల్య.. ఈ స్కీమ్ యొక్క అదిరిపోయే ప్రయోజనాలివే!
ఆన్ లైన్ లో లేదా పోస్టాఫీస్ లేదా బ్యాంక్ ద్వారా ఈ అకౌంట్ ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కనీసం 1000 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ విత్ డ్రాలకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. భవిష్యత్తులో మంచి ప్రతిఫలం కావాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
గడిచిన పది సంవత్సరాలలో ఈ స్కీమ్ ను ఏకంగా కోటీ 86 లక్షల మంది ఎంపిక చేస్తున్నారని ఆ మదుపు విలువ ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయలు అని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ స్కీమ్ లో పెట్టుబడులకు ఈక్విటీలో 14 శాతం ఇచ్చామని కార్పొరేట్ డెట్ లో 9.1 శాతం ఇచ్చామని ప్రభుత్వ సెక్యూరిటీలలో 8.8 శాతం చొప్పున ప్రతిఫలం ఇచ్చినట్టు తెలిపారు.
ఇప్పటికే ఎన్పీఎస్ స్కీమ్ అమలవుతుండగా ఈ స్కీమ్ ఆ స్కీమ్ కు అదనం అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో అకౌంట్ తీసుకుంటే 18 సంవత్సరాల తర్వాత ఆ అకౌంట్ సాధారణ అకౌంట్ గా మారే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే కొన్ని ప్రముఖ పైవేట్ బ్యాంకులు ఈ స్కీమ్ ను ఆఫర్ చేస్తున్నాయి. పేరెంట్స్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ స్కీమ్ లో మార్పులు చేపడతారని తెలుస్తోంది.