దగాడిఎస్సీ Vs మెగాడిఎస్సీ: నిరుద్యోగుల పాలిట ఒక విజన్ తో దూసుకుపోతున్న రేవంతన్న.!

FARMANULLA SHAIK
* డియస్సీ అభ్యర్థులను నట్టేటా ముంచేసిన కేసీఆర్.!
* ఎన్నికల హామీలో భాగంగా డియస్సీకి పెద్దపీట వేసిన రేవంత్.!
* 11062 పోస్టులతో మెగా డియస్సీ ప్రకటన.!
* అక్టోబర్ చివరినాటికీ అభ్యర్థులకు పోస్టింగ్లు.!
(తెలంగాణ-ఇండియాహెరాల్డ్):  రాష్టంలో డీఎస్సీ నిర్వహిస్తారని గంపెడు ఆశలతో ఎదురు చూసిన నిరుద్యోగుల ఆశలు గత ప్రభుత్వంలో అడియాశలయ్యాయి.4 లక్షల మంది అభ్యర్థులు గత 6 సంవత్సరాలుగా టీచర్ పోస్టుల కొరకు ఎదురు చూస్తుంటే 2022 మార్చి 9న అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్ 13 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపి చివరికి 5089 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపి కనీసం ఆ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించాలనుకున్న ప్రభుత్వ అలసత్వంతో వాటిని సహితంగా నిర్వహించలేకపోయింది.దీంతో నిరుద్యోగ అభ్యర్థులు విసిగిపోయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త ప్రభుత్వం అయినా మెగా డీయస్సీ నిర్వహిస్తుందని అభ్యర్ధుల భారీ ఆశలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీకి ఆమోదం తెలిపి 2024 ఏప్రిల్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం సెప్టెంబర్ 6న 5089 టీచర్ పోస్టులకు టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేశారు. పోస్టులు పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం స్పందించలేదు.పరీక్ష తేదీలు కూడా ప్రకటించింది. నవంబరు 20 నుండి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.కానీ అంతలోనే ఎన్నికల కోడ్ రావడం ఎన్నికలు నవంబరు 30న ఉండడంతో అభ్యర్థుల డిమాండ్ మేరకు పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో డీఎస్సీ పరీక్షలపై ఆశలు చిగురించాయి. అయితే కొత్తగా వచ్చిన రేవంత్ ప్రభుత్వం గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటన రద్దు చేసినట్లు ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసి పాతపోస్టులకు కొత్తగా ఖాళీలను జతచేస్తూ 11062 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.దానికి సంబంధించిన పరీక్షలు కూడా జులై, ఆగష్టు నెలలో పూర్తి చేసింది. అయితే డియస్సీ పరీక్షకు సంబంధించి ఇటీవల ఫైనల్ కీ కూడా విడుదల చేసింది. మరో రెండుముడ్రోజుల్లో ఫలితాలు కూడా ఇచ్చి అక్టోబర్ నెల చివరినాటికి పోస్టింగ్లు కూడా ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.అలాగే ఈ ప్రక్రియ ముగియక ముందే ఇటీవల ఇచ్చిన జాబ్ క్యాలెండరు ప్రకారం మరో డియస్సీకి కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ప్రకటించారు.దీన్ని బట్టి డియస్సీ పరంగా సీఎం రేవంత్కు ఉన్న చిత్తశుద్ధి ఏంటనేది తెలుస్తుంది.
ఈవిధంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గత 9నెలల పాలనలో దేనికి లొంగక నిరుద్యోగులకు చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటా పోవడంలో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారని తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డియస్సీ అనేది ప్రధాన అంశం అని గత మాజీ సీఎంలు ఐనా కెసిఆర్, జగన్లకు నిరుద్యోగులు తమ ఓటు రూపంలో చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: