చరిత్ర తిరగరాసిన రేవంత్‌...సెప్టెంబర్ 17 'తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం' ?

Veldandi Saikiran

* సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవం
* తెలంగాణ విమోచన దినం అంటున్న బీజేపీ
* తెలంగాణ విలీన దినం అంటున్న బీఆర్‌ఎస్‌
* సెప్టెంబర్ 17న 33 జిల్లాల్లో ప్రజాపాలన వేడుకలు

తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17వ తేదీ చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ సెప్టెంబర్ 17వ తేదీ పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో కెసిఆర్ తీసుకొని పెను సంచలన నిర్ణయమే రేవంత్ రెడ్డి తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 17వ తేదీ పైన ప్రతిసారి వివాదమే నెలకొంటుంది. గత పది సంవత్సరాలుగా ఇదే తంతు నడుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ప్రజా పాలన  పేరుతో సెప్టెంబర్ 17వ తేదీన వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని... సంచలనానికి దారి తీశారు. అయితే సెప్టెంబర్ 17వ తేదీని ప్రతిసారి.. తెలంగాణ విమోచన దినంగా.. బిజెపి నిర్వహిస్తోంది. వాస్తవంగా 1949 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన నిజాం రాజుల నుంచి తెలంగాణ కు స్వాతంత్రం వచ్చింది.
 నిజాం రాజుల నుంచి తెలంగాణను కాపాడడంలో నెహ్రూ అలాగే సర్దార్ వల్లభా భాయ్ పటేల్  కీలక పాత్ర వహించారు. దీంతో ఈ... విషయంలో సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ను  ప్రశంసిస్తూ తెలంగాణ విమోచన దినంగా బిజెపి ప్రకటిస్తోంది. కానీ గులాబీ పార్టీ, ఎంఐఎం మాత్రం తెలంగాణ విలీన దినంగా జరుపుకుంటాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ విషయంలో వివాదం లేకుండా.. కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం గా నిర్వహించాలని పిలుపునిచ్చారు.అధికారికంగా ఈ.. కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని వెల్లడించారు. సెప్టెంబర్ 17వ తేదీన 33 జిల్లా కేంద్రాలలో జాతీయ జెండా ఎగురవేయాలని కూడా ఆ స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. దీంతో.. భారతీయ జనతా పార్టీ అలాగే గులాబీ పార్టీలు డిఫెన్స్ లో పడిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: