100 రోజుల పాలనలో చంద్రబాబు సక్సెస్.. ఫ్యూచర్లో అదొక్కటి చేయకపోతే చాలు?
* ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా అడుగులు
* మంత్రులు అధికారులను పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
2024 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన ఎన్డీఏ కూటమి ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది అన్న విషయం తెలిసిందే. ఇక చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో ఎలా వ్యవహరిస్తారు అనే విషయంపైనే అంతట ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే చంద్రబాబు 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఈ వంద రోజుల్లో చంద్రబాబు పాలన ఎలా సాగింది అనే విషయంపై చర్చ జరుగుతుంది. ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే.. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎంతో దూకుడుగా ముందుకు సాగారు చంద్రబాబు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా మారిన చంద్రబాబు.. ఇక ఏపీకి భారీగా నిధులు రాబట్టుకోవడంలో కూడా సక్సెస్ అయ్యారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం,పెన్షన్ పెంపు, ఉచిత ఇసుక విధానం పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఇలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగారు.
అయితే ఇటీవలే ఏపీలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తిన సమయంలో కూడా 74 ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు ఎక్కడ వెనకడుగు వేయకుండా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి అందరిలో ధైర్యాన్ని నింపారు. అంతేకాదు వరద బాధితులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. ఇవి మాత్రమే కాకుండా వైద్యం, తాగునీరు, రోడ్లు, ఆర్థిక, ఎక్సైజ్ సహ పలు అంశాలపై మంత్రులు అధికార యంత్రాంగంతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఇక అందరినీ ఉరుకులు పెట్టిస్తున్నారు చంద్రబాబు. ఇలా ఒకరకంగా చంద్రబాబు 100 రోజుల పాలనలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఇలా ఇప్పుడు వరకు అంతా బాగానే ఉన్నా హామీల అమలు పేరుతో కేంద్రం నుంచి భారీగా అప్పులు తీసుకువచ్చి.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకుండా ఉంటే చంద్రబాబు సీఎం 4.O గా సూపర్ సక్సెస్ అయినట్టే అని అభిప్రాయపడుతున్నారు ఏపీ ప్రజలు.