అనితను అడుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్..ఏంది అక్కా ఇది ?
అనిత అక్క ఏంది నీ తిక్క.. అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసి మరి అనిత పై రెచ్చిపోయారు టాలీవుడ్ హీరోయిన్ మాధవి లత. నిత్యం సోషల్ మీడియాలో ఉండే మాధవి లత... హిందుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా సంఘటనలు జరిగితే ఖచ్చితంగా స్పందిస్తారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. ఆంధ్ర హిందూ బంధువులు ముఖ్యంగా వినాయక భక్తులు... నువ్వు ఆడుకుంటే బిక్షం వేస్తారని చురకలాంటించారు. కానీ ఫైన్లు మాత్రం వేయకని మండిపడ్డారు.
ప్రభుత్వ పెద్దలు ఎప్పుడు కూడా...హిందూ బంధువుల దగ్గర... చిల్లర ఏరుకోవడమేనా...? ఇక మీకేం పని లేదా? ఓ రేంజ్ లో రఫ్ ఆడించారు మాధవి లత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న పిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని... అలా చేసిన నిధులకు ఉరిశిక్ష వేయలేదని నిలదీశారు. కానీ హిందూ పండగలు రాగానే... డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహించారు. హిందువుల దగ్గర డబ్బులు వసూలు చేసి లాయర్ల కోసం ఖర్చు పెడతారా? అంటూ మండిపడ్డారు. కాగా తెలుగుదేశం కూటమిలో బిజెపి కూడా ఉన్న సంగతి తెలిసిందే. మరి దీనిపై ఏపీ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.